229
న న్నె చో డ క వి
ట్టెదు వడి మోవియుం గరువటిల్లెడు నీమది నింతతల్లడం
బొదవుఁడి దేమి కారణమ యుగ్మలి నాకెఱిగింపు మేర్పడన్.
[ఆ 4 పద్య. 59.]
కండవడ మనఁగా కన్నడమునందు తెఱ.
క. “తళిర్గళకండవడంగళ
తళిర్గళపానుగళెతలిర్గళోవరిగళెకెం
దలిర్గళెళసి పెళవిఱిిల్గళె
విలాసమంమెఱెదరిల్లి కెలరబలెయరొళ్."-ఆదిపురాణ.
ఈ యాది పురాణమును రచించిన యాదిపంపఁడు క్రీ శ. 940-వ సంవత్సర ప్రాంతమునం దుండినవాఁడు. ఈ యుదాహరణములనుబట్టి చూడఁగా నన్నెచోడుఁడు తన కాలపువియుఁ దన పూర్వకాలపువియుఁ నైన కన్నడ గ్రంధములను బాగుగాఁ జదివినవాc డయినట్టు కనబడు చున్నాఁడు. ఈతఁడు వాడిన కన్నడ పదము లన్నియు పూర్వకాలమునందు కర్ణాటకాంధ్ర భాషలకు రెంటికిని సామాన్యము లని మనవారు చెప్ప వత్తురు. అవి పూర్వము రెండు భాషలకును సామాన్యములని యెట్లు దెలిసికోవచ్చును ? ఏ పూర్వకవులు వీనిని బ్రయోగించిరి ? నన్నయభట్టారకాదులు ప్రయోగింపలేదు. 'బెదరుచు" నన్న పయి పద్యమునం దింకొక విశేష ప్రయోగము కూడc గానఁ బడుచున్నది. " ఒదవుటిదేమి?" యనుటకు మాఱుగా "ఒదవు డిదేమి ? " యను రూపము వాడఁబడినది. ఈ పుస్తకమును వ్రాసిన తంజావూరిలోని యఱవ వాండ్రకు ట డ భేదము చక్కఁగాఁ దెలియక పోవుటచేత వ్రాఁతలో నిట్టి రూపములు పడి యుండవచ్చును. అట్టివి పూర్వకాలపురూపములవి భ్రాంతి చెంది ముద్రాపకులు వాని నట్టెయుంచి యుందురు. ఇట్టి రూపము లీ పుస్తకమునం దిరువది ముప్పదిచోట్ల వేయబడి వాని క్రింద "ఒదవుడు-ఒదవుట" యనునట్లు టిప్పణములు వ్రాయఁబడినవి. డకారమువ్నచోట్ల టకారము వేసిన నీ యాయాస మంతయు తప్పిపోయి యుండును. ఈ యన్ని స్థలములలో డకారమును టకారమునుగా మార్పగూడని స్థల మొక్కటియు లేదు. అపూర్వరూపములను