Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

           నేరc, డది యట్ల దొంతులు చేరినాయి
           దోర్ఫనేర్చుఁ గా కది యేమి చేర్పనేర్చు [ అ 1-19 ]

ఈ పద్యమునం దితఁ డనావశ్యకముగా కుక్కయనుటకు మాఱుగా "నాయి" యను నన్యభాషాపదమును ప్రయోగించి యున్నాఁడు. ద్రవిడభాషలోను, కన్నడభాషలోను కుక్కను నాయి యందురు. ఇట్లు తఱచుగా కన్నడ పదముల నుపయోగించుటయు, గ్రాంధికభాషలోను వ్యావహారికభాషలోను గూడ లేని యప్రతీతపదములను వాడుటయు స్వచ్చమయిన యీతని కవిత్వమునకుఁ గొంత కళంకమును దెచ్చుచున్నవి. *[1] దీనిని మనస్సునం దుంచుకొని యీ కవి నుద్దేశించియే కాఁబోలును తిక్కనసోమయాజి తన విర్వచనోత్తర రామాయణపునందుఁ గుకవిదూషణముగా నీ క్రింది. పద్యమును వేసి యున్నాఁడు.

        చ. పలుకులపొందు లేక రసభంగము చేయుచుఁ బ్రాఁతపడ్డ మా
           టలఁ దమ నేర్పు చూపి యొకటన్ హృదయం బలరింపలేక
           యే పొలమును గానియట్టి క్రమముం దగ మెచ్చుగ లోకమెల్ల న
           వ్వులఁబొరయం జరించు కుకవుల్ ధర దుర్విటులట్ల చూడఁగన్."

ఈ పద్యమునందు దుష్కవులు దుర్విటులతోఁ బోల్పఁబడి యున్నారు. కొందఱు పొగడినంత యత్యుత్తమమయినది కాకపోయినను, నన్నెచోడుని కవిత్వ మన్యభాషాపదదూషితము కానియెడల నుత్తమమయినదనియే చెప్పవచ్చును. ఇతడు సంస్కృత గ్రంధములను మాత్రమేకాక కన్నడ గ్రంథములను సహితము విశేషముగాఁ జదివి యుండుటచేత నాగ్రంధముల

  1. ['వ్యాకరణమునకు లొంగని పదములు అప్రతీత పదములు, భాషాంతరపదములు, నీకావ్యమునందుండుట దీని ప్రాచీనతను వ్యక్తము చేయునదే ! ఇట్టి ప్రయోగములవలన కవి కేమాత్రము కళంకము కలుగదు. ప్రాచీనకవుల ప్రయోగము లర్వాచీనములగు వ్యాకరణములకు లొంగకుండుట కవి కపకర్షను కల్లింపదు' - అని పండిత విమర్శకులు కొందఱభిప్రాయపడుచున్నారు.]