223
న న్నె చో డ క వి
వచ్చును. దీనినిబట్టి యీ చోడబల్లి నన్నిచోడు లిద్దరు పాకనాటిలోనివారే యనుటయైనను స్పష్టమగును. ఇక సామాన్యపుశంకల నట్టుంచి. యీ శాసనములవలన చోడబల్లికొడుకు నన్నిచోడుడు, ఈతని కరికాలచోడాన్వయజనితత్వము, పాకనాటిలో నునికి, ఏకవింశతి సహస్రగ్రామావనీ వల్లభునితోడి సంబంధము చోడబల్లిచే నారాధింపబడిన యెుక కాలముఖ వ్రతుఁడగు మల్లికార్జున యోగి, దారిద్ర్యవిద్రావణ బిరుదముగల ప్రభువు. రామేశకవి - అను నిన్ని విషయములు గిట్టినవి కావున నీ కవి క్రీ శ 1100 ప్రాంతమువాఁడని, నన్నయ కవ్యవహిత పరమందుండి యుండునని తలంపు వచ్చును. [పు. X111]
నన్నిచోడుని కాలమును గూర్చి విపులముగ విమర్శించిన పిదప 'ఆంధ్రకవి తరంగిణి' కారులు కుమార సంభవ మందలి పదప్రయోగాదులనుబట్టి నన్నిచోడుడు ప్రాచీనుఁడనియు, నతనిది ప్రాచీన కవిత్వమనియు నన్నయకుఁ బూర్వుఁడో, పరుఁడో నిర్ణయింపఁ జాలము" అని వ్రాసియున్నారు. [పుట 202]
ఈ విషయమున 'తెనుఁగు కవుల చరిత్ర" లో గ్రింది విధముగఁ గలదు.
'ఈతఁడు రాజైనను, ఈ గ్రంధమున చారిత్రకాంశములను తెలుపక పోవుట చేత నీతని కాలము వివాదములకు మూలమైనది. అవి నాలుగు విధములు - 1. ఈ కవి తెనుఁగున నాదికవియని యనుకొనుచున్న నన్నయభట్టారకునకు పూర్వుఁడు అనఁగా క్రీ. శ. 940 ప్రాంతమువాఁడు. 2. నన్నయతో సమ కాలికుఁడు అనఁగా 1051 సం. ప్రాంతమువాఁడు. 3. నన్నయకు వెనుకనొక శతాబ్దిలోపువాఁడు. ఆనఁగా క్రీ. శ. 1130-1150 సం. ప్రాంతము వాఁడు. 4. తిక్కనకు తరువాతివాఁడు అనఁగా సం. 1275-1350 ప్రాంతము వాఁడు. నన్నెచోడకవి క్రీ శ సం 1130-50 ప్రాంతమువాఁడనియే నేఁడంగీకృతమైనది'.] [పుట 200]
కుమారసంభవములో నితఁడు చేసిన కుకవినింద యిది.
గీ. 'చెనసి గుణమైన దోషంబు సేయ నేర్చుఁ
గుకవి కృతులందు దోసంబు గుణము సేయ