222
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
అచ్చటి వాఁడును, పాకనాటి చోడ వంశము వాఁడును గాక - ఒరయూరును పాలించుచు (మగణమ్ము గది రగణమ్మును వేసి పద్యము చెప్పుటచే) పాశ్చాత్య చాళుక్యరాజులచే రణరంగమున నిహతుఁడైన వాఁడనుట సంభావ్యముగాఁ గనఁబడదు. ఆంతరంగిక సాక్ష్యమగు వ్యాకరణచ్ఛందో విశేషా పూర్వపద ప్రయోగములలోఁ గొన్ని నన్నయ తరువాతి కవులలోఁ గూడఁ గనఁబడుటచేత - వాని విషయమున నన్నయ యవలంబించిన దానికంటె భిన్నమగు సంప్రదాయము నవలంబించినవాఁడనియే వ్యక్తమగుచున్నది గాని, నన్నయకుఁ బూర్వఁడను కాలనిర్ణయమున కిది తోడ్పడునదిగా లేదు. (పీఠిక పుటలు VI-VIII)
ఇక నన్నిచోడుని నన్నయకు సమకాలికునిగా నిశ్చయించినవారిలో శ్రీ దేవరపలి (వెంకట) కృష్ణారెడ్డిగారు ముఖ్యులు. ఉద్భటుని గూఢ వస్తుమయకావ్యమునం దాదరము చూపిన సన్నిచోడునకుఁగూడ గూఢ వస్తుమయరచనయం దాదరము కలదనియు, కావుననే గ్రంధరచనాకాలమును 12-వ ఆశ్వాసమందు గూఢముగ "ఖడ్గలత పూచెనొ నాజయజై_త్ర సంపదన్’ అను పద్యములో జయసంవత్సర, జయమాస, జయతిధి, జయ వారమైనట్లు సూచించినాఁడనియు, ఇది విక్రమయంగపద్ధతిని తిధివారనక్షత్రముల కలయికచే క్రీ. శ. 1057 సం. సరిపోవుననియు, కావున నాతఁడు నన్నయకు సమకాలికుఁ డగుననియుఁ దెలిపిరి. వీరు చూపిన లెక్కలలోఁ గూడ నొక సంవత్సరము తేడా కనcబడుచునేయున్నది. ....నన్నిచోడుని వాస్తవాభిప్రాయము నిది యెంతవరకు సమర్ధింపగలదో తెలిసికొను నితరాధారమేమియునులేదు. ఇది యిట్లండ నిదివరకు లభించిన శాసనములలో నీకాలపువాఁడగు నన్నిచోడుని సూచించు శాసన మేదియు బయలు పడలేదు.... కావున నీకవి నన్నయ తిక్కనల నడిమివాఁడనువారి వాదమే యిప్పటి కాదరణీయముగా కనఁబడుచున్నది [పుట xii]
..చోడబల్లి పాకనాటియం దిరువదియొక్కవేయింటి కధీశుఁడేనా ? యను సందేహమున కాతని తరువాతి తరమువాఁడు, శాసనకర్తయగు మల్లిదేవచోడున కాబిరుదమున్నప్పు డీతనికి నుండి యుండునని మన మూహింప