Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

225

న న్నె చో డ క వి

యందలి భావములను, పదములను గొంత చేకొనియున్నాఁడు. ఈ యంశమును స్థాపించుటకై పుస్తకసంపాదకులు చూపినవానిని మాత్రమే యొకటి రెంటినిం దుదాహరించుచున్నాను.

             క. ముదమున సత్కవి కావ్యము
                నదరక విలుకొనిపట్టినమ్మును బరహ్భ
                ద్భిదమై తల యూఁపింపని
                యది కావ్యమో ? వాని [1]పట్టినదియుం గరమే [ఆ1- 41]

అనెడు ప్రథమాశ్వాసములోని యీ నలువదియొకటవ పద్యము

             శ్లో. కిం కవే స్తస్య కావ్యేన కిం కాండేన ధనుష్మతః
                పరస్య హృదయే లగ్నం న ఘూర్ణ యతి యచ్చిరః

అను సంస్కృత శ్లోకమునకు తెలుఁగు, పయి వద్యము పీఠికలో నున్నట్టు చేకొనఁబడినది. గ్రంధములో 'నదరక' యన్నచోట 'నదరఁగ' ననియు, 'వానిపట్టినది" యనుచోట "మలరిపట్టినది" యనియుఁ బాఠ భేదములు గలదయి యున్నది.

   మహస్రగ్ధర. హర హాసాకాశగంగాత్యమలజలమరాళాబ్జ నీహారధాత్రీ
                ధరకర్పూరేందుకాకోదరవరపతిదిగ్దంతి పక్షిరనీరా
                కరముక్తాహారకుందోత్కఠ రజత శరత్కౌముదీ ద్యోతకీర్తీ
                శ్వరునాత్మారామువాణీ వరువరగురుసర్వజ్ఞునజ్ఞానదూరున్.

చతుర్ధాశ్వాసాంతమందలి యీ 475 వ పద్యము

               'హరహాసాకాశగంగాజలజలరుహనీహారధాత్రీ
                ధరనీహారాంశుతారావనిధరశరదంభోధరక్షీరనీరా
                కరతారాభారతీదిగ్రదనిరదనపీయూష డిండీరముక్తా
                కరకుందేంద్రేభహంసోజ్జ్వలవిశదయశోవల్లభం శాంతినాధమ్.'

  1. [పట్టినదియున్ శరమే ?' అనునది సరియైన పాఠము]