Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

రాలయము కట్టించి యెుక తటాకము నిర్మించినట్టును రాజు తమ్ముడైన చోడబల్లి కొప్పరము సమీపమున నున్న బైడిపల్లిని దానము చేసినట్టును, ఈ దానములను మారన ప్రార్ధనముమీఁద విష్ణువర్ధనునిక్రింది యధికారి యైన మహామండలేశ్వరకడియరాజు స్థిరపఱిచినట్టును, సోమేశ్వరాలయము పాలూరునందలి కాలాముఖ సన్యాసి మల్లికార్జునుని పాలనమునందుంచcబడినట్టును, చెప్పఁబడి యున్నది. ఈ శాసనమును బట్టి చూడఁగా బల్లి చోడుఁడు మొదలైనవారు సర్వస్వతంత్రులుగాక పేరునకైనను చాళుక్యచక్రవర్తులకు లోఁబడిన మహామండలేశ్వరు లనియు తేటపడుచున్నది. ఈ శాస నమును బట్టి చూడఁగా నన్నెచోడుని సోదరుని కాలములో కాలాముఖమల్లికార్జునయోగి యుండినట్టును, నన్నెచోడునితండ్రి చోడబల్లి యనబడెడు త్రిభువనబల్లిచోడుఁడయి నట్లును రెండంశములు స్థాపింపఁబడినవి. ఈ చోడబల్లికిఁ ద్రిభువనమల్లచోడబల్లి యని పేరు వచ్చుట కతఁడు త్రిభువనమల్ల చాళుక్యచక్రవర్తి పాలనకాలములో నుండుట కారణమని మనము సులభముగాఁ దెలిసికొనవచ్పును. ఈ బల్లి చోడునికిఁ గామచోడబల్లి యనియు నామము గలదు. ఇఁక తల్లినిగూర్చిన మూడవ యంశము స్థాపింపఁబడవలెను. ఈ సన్నెచోడునితల్లి మాబలదేవి యని శాసనము చెప్పచున్నది. శ్రీసతికి మాబలదేవి మాఱు పేరు కాcగూడదా ? కావచ్చును.

ఈ సంబంధమున 1915-16 వ సంవత్సరపు కార్యనివేదనపత్రికలోనే "పేర్కొనబడిన ౩68 వ సంఖ్య గల నన్నెచోడుని శాసనమునే విచారింతము. ఈ శాసనము శక సంవత్సరము 1175 అనగా క్రీస్తుశకము 1153 వ సంవత్సరము విషువత్సంక్రాంతినాఁడు సోమేశ్వరాలయమునకుఁ జేసిన భూదానములను గూర్చినది. ఈ కాలమునందు రాజ్యమేలుచుండినవాఁడు మహామండలేశ్వరత్రిభువనమల్ల దేవమహారాజాత్మజుఁ డైన నన్నెచోడుఁడు. ఈ శాసనము నరసారావుపేట తాలూకాలోని చెన్నుపల్లియగ్రహారమునcదలి పరశువేదీశ్వరాలయముయెుక్క యెదుటనున్న నంది స్తంభముమీఁద చెక్కఁబడి యున్నది. ఈ శాసనములో నన్నెచోడునికి కన్నరచోడుఁడు