217
న న్నె చో డ క వి
మణి, కాశ్యపగోత్రోద్భవ" మొదలైన విశేషణములు చెప్పఁబడినవి. ఈ ప్రకారముగానే 20-వ సంఖ్య గలదానిలో 1143 మొదలు 1154 వఱకు రాజ్యముచేసిన జగదేకమల్లచక్రవ ర్తి బిరుదులు సమస్తభువనేశ్వరాది వాక్యములతోఁ బేర్కొనఁ బడినపిమ్మట చోడ బల్లి యొరయూరపురవరాధీశ్వరాది బిరుదులతోఁ జెప్పఁబడెను. ఒక శాసనము త్రిభువనమల్లుని కాలము లోను, రెండవ శాసనము జగదేక మల్లుని కాలములోను వ్రాయఁబడుటయే. చోడ బల్లియెుక్కనామవ్యత్యాసమునకుఁ గారణము
నన్నెచోడుని కాలమును సరిగా నిర్ధారణము చేయుట కా కాలములో జంగమమల్లికార్జునుఁ డుండుటయు తండ్రి బలిచోడుఁడగుటయు, తల్లి శ్రీదేవి యగుటయు, ముఖ్యముగా మూఁడు కావలెను. ఈ విషయమును నిర్ణయించుటకు 1915-16 వ సంవత్సరపు దక్షిణమండల శాసనకార్య నివేదనపత్రిక (Epigraphical Report of the Southern Circle for the year 1915-16) మనకు కొంత తోడుపడుచున్నది. నర్సారావుపేట తాలూకాలోని కొప్పరపు గ్రామము నందలి కోదండరామస్వామి దేవాలయముముందున్న నాగ స్తంభముమీది 328 వ సంఖ్య గల శిలాశాసనములో చోడబల్లియు, మల్లికార్డునయోగియుఁ జెప్పఁబడి యున్నారు. శాలివాహనశకము 10౩7 అనఁగా క్రీ.శ.1115 జయసంవత్సర చై_త్రబహుళ అమావాస్యనాఁడు సూర్యగ్రహణసమయమునందుఁ జేయఁబడిన దానములను గూర్చి యీ శాసనము చెప్పుచున్నది. అప్పడు త్రిభువనమల్లచోడుని జ్యేష్టపుత్రుడైన కన్నడ చోడదేవుఁడు రాజ్యము చేయుచుండెను. త్రిభువనమల్లచోడుని ముగ్గురు పుత్రులలో నన్నెచోడుని జ్యేష్ఠునిగాఁ గొన్ని శాసనములు చెప్పుచున్నను, మఱికొన్ని శాసనములు నన్నెచోడుని కనిష్ఠపుత్రునిగాను, కన్నెరచోడుని జ్యేష్టపుత్రునిగాను జెప్పుచున్నవి. ఈ శాసనమునందు రాజు యొక్క వంశపరంపరాగతమంత్రియు నీశ్వరనాయకపుత్రుఁడును నయిన మారన రెండు గొప్పచెఱువులు త్రవ్వించి కొప్పరగ్రామములో సోమేశ్వ