219
న న్నె చో డ క వి
సోదరుఁడయినట్టును మాబలదేవి తల్లియైనట్టును చెప్పఁబడినది ధపు ప్రథమ శాసనమునందు చెప్పఁబడినట్టు నన్నెచోడునికి మాబలదేవి తల్లి యగుట సత్యమా ? ఈ ద్వితీయ శాసనమునందు జెప్పఁబడినట్టు మాచలదేవి తల్లి యగుట సత్యమా ? రెండును సత్యములే. రెంటికిని శ్రీసతి యనియే యర్ధము. గాలి నరసయ్యశాస్త్రి తన యింటిపేరైన గాలికి ప్రభంజనమనియు, నరసయ్య కహోబలుఁడనియు, పర్యాయపదములు వేసికొన్నట్లే కవులు పేరులకు పర్యాయ పదములు వేయుట మనలో నాచారమై యున్నది.
మా + అబల = శ్రీ(లక్ష్మి,) అబల = సతి (స్త్రీ) మాబల = శ్రీసతి
మా + అచల = శ్రీ, అచలదేవి = (పర్వతపుత్రి)సతి, మాచల దేవి = శ్రీసతి
'మాబల' యనిగాని 'మాచల' యని గాని పద్యములో వేయవలసిచో దానితుదను దేవీపదము చేర్పవలసి యుండును. కవి తాను రచించిన చంపకమాలలో గణ సౌలభ్యార్ధము మాబలార్థబోధక మయిన శ్రీసతి పదమును ప్రయోగించి యుండును. ఇది తృప్తికరమైన సమాధానము కాకపోయినను, ఇంతకు మించి యాధారము దొరకనప్పుడు దీనినే సరిపఱచుకొనవలెను. ఇప్పటికి దొరకిన యీ యాధారములనుబట్టి నన్నెచోడుcడు 1150 కిఁ దరువాత నున్నవాడఁని యేర్పడుచున్నది. ఆ కాలమందలి మండలేశ్వరు లందఱును రాజ్యకాంక్షచేత నొండొరులతోఁ బోరాడుచు జయాపజయములను బొందుచు నుండెడివారు. ఈ యల్ప యుద్ధములలో నొక్కదానియందు 940 వ సంవత్సరమునందు కాకపోయినను నన్నెచోడుడు తరువాత నిన్నూటనలువది సంవత్సరములకయినను ని హతుఁడయు యుండును. మూఢ విశ్వాసములధికముగాఁ గల యాకాలము నందాతని మృతిని శుభాశుభగణవిధిజ్ఞు లయిన లక్షణజ్ఞులు మగణముతరువాత రగణము వేయుట కారోపించుటయు, సామాన్యజను లా మాటలను విశ్వసించుటయుఁ దటస్థించెను. అందుచేత సన్నెచోడునకుఁ దరువాత గొంతకాలమున కున్న యధర్వణాచార్యుఁడు తనఛందస్సులో నీ క్రిందిపద్యమును వేసెను.