213
న న్నె చో డ క వి
నన్నెచోడుఁడు 940 -వ సంవత్సరమునందు రణనిహతుc డయ్యె నన్న రామకృష్ణకవి గారి సిద్ధాంతము పూర్వపక్ష మయిపోయినది. అయినను రామకృష్ణకవిగారి కిటీవల లభించిన నన్నెచోడుని కుమారసంభవముయెుక్క ప్రత్యంతరములో పాఠభేదము కనఁబడి వారిసిద్ధాంతమును గొంతవరకు మరల నిలువఁ బెట్టినది. రామకృష్ణకవిగారు 1914 వ సంవత్సరము నందుఁ బ్రకటించిన నన్నెచోడుని కుమారసంభవముయొక్క ద్వితీయ భాగములో నీ పద్యపాఠాంతరమును "రంధ్రవిషయంబునఁ జనఁ జాళుక్య రాజు మొదలుగఁ బలువుర్ " అని చూపిరి ఈ పాఠభేదమునుబట్టి పద్య మీ విధముగా మాఱుచున్నది.--
క. "మును మార్గకవిత లోకం
బున వెలయఁగ దేశికవితc బుట్టించి తెనుం
గును నిలిపి రంధ్రవిషయం
బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్."
ఈ పాఠాంతరము సత్యాశ్రయుని బాధను తొలఁగించినను ఆంధ్రపత్రిక యొక్క 1911 వ సంవత్సరపు సంవత్సరాదిసంచికలో బుఱ్ఱా శేషగిరిరావు పంతులుగారు వ్రాసిన యీ క్రిందియంశమును గొంత పోషించుచున్నది .--
"సత్యాశ్రయుని తొట్టి చాళుక్యనృపులు ఆంధ్రవిషయమున తెలుగుఁ దేశ కవిత నిలిపిరని కవి వ్రాయుచున్నాఁడు. పైనుదాహరించిన శాసన నిదర్శనముల ప్రకార మిందుఁ జెప్పబడిన సత్యాశ్రయుండు భారతమును రచియించుటకు నన్నయను బ్రోత్సాహపఱిచిన రాజరాజనరేంద్రుఁ డని యూహింపఁ దగు. భారతమందు సత్యాశ్రయకులతిలక యని రాజరాజ విషయమున వాడcబడి యున్నది"
మొదటి పాఠమునుబట్టి సత్యాశ్రయకులతిలకుఁడైన రాజరాజ నరేంద్రుండు సత్యాశ్రయుండు కాకపోవచ్చును గాని యీ పాఠమును బట్టి