పుట:Aandhrakavula-charitramu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

చాళుక్యరాజు నిర్బాధకముగా రాజరాజనరేంద్రుఁడు కావచ్చును, అట్లయినచో నన్నెచోడుడు నన్నయభట్టునకుఁ దరువాతివాఁ డయి యుండవలెను.

నాలవది కవికొలమును నిశ్చయించుటకై ప్రధానసాధనము కవి గ్రంథము నారంభించిన సంవత్సరమునో, పూర్తి చేసిన సంవత్సరమునో పుస్తకమున వ్రాసికొనుట, ఈ కవి యదియుఁ జేసి యుండలేదు. అందుచేత మనము పుస్తకములోని సాధనసామగ్రి ననుసరించి యితరాధారములచేతనే కవికాల నిర్ణయమును జేయవలసి యున్నది.

బుజ్జా శేషగిరిరావుగారు త్రిభువనమల్ల చోడదేవుని కొడుకే నన్నెచోడుఁడని వ్రాయఁగా తమ యాంద్రులచరిత్రము ద్వితీయభాగముయొక్కయవతారికలో చిలుకూరి వీరభద్రరావు గారు

"శ్రీ బుఱ్ఱా శేషగిరిరావు ఎం-ఏ గారు పండ్రెండవ శతాబ్దము మధ్య నున్న త్రిభువనమల్ల చోడదేవుని చోడబల్లిగా భావించి యతని జ్యేష్టపుత్రుఁడైన నన్నెచోడుఁడే నన్నెచోడకవి యని సిద్ధాంతము చేసినారు; కాని త్రిభువనమల్లుఁడు చోడబల్లి కాఁజాలఁడు. అదియునుగాక త్రిభువనమల్లుని కొడుకైన నన్నెచోడునితల్లి మాబలదేవి యని శాసనములం గన్పట్టుచున్నది.కుమారసంభవమునఁ దన తల్లి శ్రీసతి యని నన్నెచోడకవి చెప్పకొనియున్నాడు."

అని వ్రాసిరి. తమ యాంధ్రులచరిత్రమునందు - శాసనమును బల్లయచోడ దేవుని కొడుకు కామచోడుఁ గని స్పష్టముగా ఘోషించుచుండగా దానికి ప్రత్యక్ష విరోధముగా చోడ బల్లికిఁ బెక్కండ్రుగురు భార్యలు గల రనియు, నన్నెచోడుఁడు పెద్దభార్యకొడుకనియు, కామచోడుఁడు మరియొక భార్య యొక్క తనయుఁ డనియు, మనమూహింపవచ్చు నని నిరాధారము లైన యూహలపై నూహలను పన్ని నన్నెచోడుఁడు క్రీ. శ.1116 వ సంవత్సరములోని శాసనములోఁ బేర్కొనcబడిన బల్లియచోడ దేవమహారాజు కొడుకని సిద్ధాంతము చేయ సాహసింపఁగలిగిన వీరభద్రరావుగారు త్రిభువనమల్లచోడునే బల్లె చోడునిగా భావించి యాతనిపుత్రుడైన నన్నె