పుట:Aandhrakavula-charitramu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

212

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

సంగీతరత్నాకరములోని యీ క్రింది శ్లోకము లీ యర్ధమును స్పష్టపఱుచుచున్నవి--

      శ్లో|| గీతం వాద్యం తథా నృత్తంత్రయం సంగీత ముచ్యతే
           మార్గో దేశీతి తద్ద్వేధా తత్ర మార్గ స్స ఉచ్యతే.
           యో మార్గితో విరించాద్యైః ప్రయుక్తో భరతాదిభిః
           దేవస్య పురత శ్శంభో నియతోభ్యుదయప్రదః
           దేశేదేశే జనానాం య ద్రుచ్యా హృదయరంజకం
           గీతం చ వాదనం నృత్తం తద్దేశీ త్యభిధీయతే.

1912 వ సంవత్సరమునందుఁ బ్రకటింపcబడిన తమ యాంధ్రుల చరిత్రము యొక్క ద్వితీయభాగములో శ్రీ చిలుకూరి వీరభద్రరావుగారు నన్నెచోడునిగూర్చి వ్రాయుచు 925-40 సంవత్సర ప్రాంతమున నున్న యీ సత్యాశ్రయుని నన్నెచోడమహాకవి తన కుమారసంభవకావ్యమున నీ క్రింది పద్యములోఁ బేర్కొని యున్నాఁడు

       క. 'మును మార్గకవిత లోకం
          బున వెలయఁగ దేశికవితఁ[1] బుట్టించి తెనుం
          గు నిలిపి రంధ్రవిషయమున
          జనసత్యాశ్రయునిఁ దొట్టి చాళుక్యనృపుల్'

దీనిం బట్టి నన్నయభట్టారకుని నూఱేండ్లకుఁ బూర్వమే యాంధ్ర కవితాసతి వర్ధిల్లుచున్న దని స్పష్ట మగుచున్నది. ఈ పై పద్యమునందుఁ జెప్పబడిన సత్యాశ్రయునకుఁ దరువాతనే నన్నెచోడుఁ డున్నవాఁ డని నిస్సంశయముగాఁ జెప్పవచ్చును" అని వ్రాసిరి. ఈ సత్యాశ్రయకథనమువలన

  1. శ్రీ వీరేశలింగము పంతులుగారభిప్రాయ పడినట్లే 'ఆంధ్రకవి తరంగిణి' "కారులును మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వమనియు, "దేశికవిత యనఁగా నాంధ్రకవిత యనియు సభిప్రాయపడి యున్నారు [చూ. పుట 165] కాని యిది సరికాదు. ప్రాచీన సంస్కృతి సాహిత్యమార్గము ననుసరించిన లక్షణములు కలది మార్గకవిత; దేశీయ సంప్రదాయములు కలది దేశికవిత.