పుట:Aandhrakavula-charitramu.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

211

న న్నె చో డ క వి

యని వేసి సంపాదకులు డకారమును దేలఁ బలుకవలయు నని పట యడుగున నొక టిప్పణము వ్రాసిరి గణభంగము కలుగకుండ సాధారణ మైన 'యెద" యనురూపమును వేయక గ్రంథము పురాతనమైన దని చూపుటకుఁ దక్క నసాధారణమైన 'యెడ్డయనురూపమును వేసి యెడ్డలోని యెకారము లఘు వగు నని చూపుట కేల ప్రయాసపడ వలెను. రామేశ్వర కవిని గూర్చి "కవితరంగిణి" లో నిట్లు వ్రాయబడినది.

['రామేశ్వరకవి కవికాలము నాఁటికిఁ బ్రసిద్దుఁడై యుండిన యాంధ్ర కవియై యుండును' అని శ్రీ వీరేశలింగము పంతులుగారు వ్రాసియున్నారు.ఇతడాంధ్రకవి యనుట కాధారములు లేవు. ఏ భాషాకవియో చెప్పఁజాలము. కుమార సంభవకావ్యమునకు విమర్శనము వ్రాసిన శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రులుగారీ పద్యమున రామేశ్వరకవి ప్రశంసయే లేదని యభిప్రాయపడి యున్నారు. శ్రీ ముట్లూరు వేంకటరామయ్యగారు భారతి (వృష-శ్రావణము) లో కాకతీయ - రెండవ బేతరాజనకును, నాతని కుమారుఁడును దారిద్ర్యవిద్రావణ బిరుదాంచితుcడునైన త్రిభువనమల్ల దుర్గరాజునకును గురువై, వారిచే నగ్రహారములను గైకొని, కాలాముఖశైవ పరంపరకు సంబంధించిన శ్రీ శైల మల్లికార్జున మఠాచార్యుఁడుగ నుండిన రామేశ్వర పండితుఁడే పై పద్యములోఁ జెప్పిన రామేశ కవియై యుండుననియు, నన్నెచోడకవి దారిద్ర్యవిద్రావణ మకుటముతో రచించిన దశకమునకును, త్రిభువనమల్లుని దారిద్ర్య విద్రావణ బిరుదమునకును నేదియో సంబంధముండి యుండుననియు వ్రాసియున్నారు. రెండవ బేతరాజువలన రామేశ్వరపండితుఁడు దానమును బరిగ్రహించిన కాలము చాళుక్య విక్రమ శకము 23 [శా.శ.1019 క్రీ.శ.1017 - 1098 ].ఈ రామేశ్వరపcడితుఁడు పండితుఁడే కాని కవియైనట్లాధారములు లేవు. పై పద్యములో నీ రామేశ్వరుఁడే చెప్పఁబడెననుటకును నాధారములు కనఁబడవు.[పు. 175]

"మును మార్గకవిత" యను పద్యములో మార్గకవిత యనఁగా సంస్కృత కవిత్వమనియు దేశికవిత యనఁగా దేశభాషాకవిత్వ మనియు అర్ధము