210
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
అను పద్యమును పుస్తకములోఁ గానఁబడుచున్నవి. ఈ పద్యములోఁ గవి చెప్పిన దేవతాస్తుతియు, గురువందనమును, పురాణకవి ప్రశంసయు, సంస్కృత సత్కవీశ్వర స్తోత్రమును పుస్తకములోఁ గానఁ బడుచున్నవి కాని దేశిసత్కవుల సంస్తుతిమాత్రము కనబడకున్నది. దేశిసత్కవులను స్తుతింపనిది స్తుతించితినని కవి యబద్ధము వ్రాసి యుండఁడు. అందుచేత "మును మార్గకవిత" యను పద్యమునకును "సురవరులన్" అను పద్యము నకును నడుమను తెలుఁగుకవులను స్తుతించిన పద్య మొకటి యుండి యుండవలెను. మాతృకను జూచి పుత్రికను వ్రాసిన లేఖకుని ప్రమాదము వలననో, మాతృకను లిఖించినవాని లోపమువలననో యా పద్యము విడిచి పెట్టఁబడి యుండును. [1] ఆ పద్యమే యుండియుండిన యెడలఁ గవికాలము కొంతవరకుఁ దెలిసి యుండును. ఈ కుమార సంభవమునందే దశమాశ్వాసమున పుత్రోత్సవ సందర్భమున బృహస్పతి శివుని స్తుతించి చెప్పిన దారిద్ర్యవిద్రావణపద్యదశకములోని మొదటిదైన యీ పద్యమునందు రామేశ్వర కవి యొకఁడు పేర్కొనcబడి యున్నాఁడు
శా. శ్రీరామేశకవీశ్వరాదు లెద నీశ్రీపాదము ల్భక్తితో
నారాధించి సమస్తలోకసముదాయాధీశులై రన్నసం
సారుల్ దుఃఖనివారణార్ధ మభవున్ సర్వేశు లోకత్రయా
ధారున్ నిన్ మదిఁ గొల్వకున్కి యుఱవే దారిద్ర్యవిద్రావణా!
[ఆ.10 - 90 ]
ఈ రామేశకవీశ్వరుఁడు కవికాలమునాఁటికి బ్రసిద్ధుడయి యుండిన శివభక్తుడైన యాంధ్రకవి యయి యుండును. పయి పద్యములోఁ బ్రథమపాదమున కవీశ్వరాదు లెద" యనుచోటు 'కవీశ్వరాదు లెడ్ద',
- ↑ [ పయి రెండు పద్యములకును నడుమ దేశ సత్కవుల స్తుతి రూపమగు పద్య ముండవలెనని భావింపనక్కఱలేదనియు, 'మునుమార్గకవిత' అను పద్యముననే దేశ సత్కవులునుతింపఁబడినట్లు భావింపవచ్చుననియు, ఇంతకును లభింపని పద్యమును గూర్చి యాలోచించినc బ్రయోజనము లేదనియు, అట్టి పద్య మొక్కటి యుండి తీరవల యునని నిశ్చయము గాఁ జెప్పుటకును తగిన యాధారములు లేవనియు ఆంధ్ర కవి తరంగిణి" యందుఁగలదు. (చూ. పుట. 165)]