Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

187

ఎ ఱ్ఱా ప్రె గ డ

లేకుండc గాపాడి యాతని పక్షమున రాజ్యము చేసె ననియు, అతఁడు మృతినొందఁగా రాజ్య మనితల్లి, వశము చేసెననియు, చెప్పుచున్నారు. స్థానికచరిత్రములలో రెడ్ల రాజ్యకాలపరిమితినిగూర్చి యీ క్రింది పద్యము కానఁబడుచున్నది.

          సీ "పోలయవేమన్న పొలుపొరఁ బండ్రెండు
                      వత్సరంబులు గాచె వసుధ యెల్ల
             అటువెన్క, ముప్పది యనపోత వేమన్న
                      వన్నెవాసికి నెక్కి వసుధ యేలె
             ధర్మాత్ముఁ డన వేమధరణీకళత్రుండు
                      పదియునేనిట భూమి పదిలపఱిిచె
             ప్రజల కు...సముగ బదునాలు గేఁడులు
                      కొమరగి రేలెను సమయుదాక

             నేలెఁ గోమటి వేమన యిరవదేండ్లు
             రాచవేమన్న నాల్గు వర్షంబు లేలె
             మించి కట్టిరి గృహరాజు మేడ కొండ
             వీట నూఱేండ్లు రెడ్లు భూ విదితయశులు."

ఈ పద్యమెంతవఱకు విశ్వసింపఁదగినదో చదువరులే యోచించుకోవచ్చును. రెడ్ల చరిత్రము నింతట విడిచి యిఁక మన కవిచరిత్రమునకు వత్తము.

కవియింటిపేరు చెదలువాడవారు. ఈ సంగతి ఎఱ్ఱాప్రెగడ వంశజుఁడయిన చెదలువాడ మల్లన రచించిన విప్రనారాయణచరిత్రములోని యీ క్రింది పద్యమువలన స్పష్టపడుచున్నది.

      సీ. "ప్రతిభతో నారణ్యపర్వశేషముఁ జెప్పెఁ
                గవులకుఁ జెవులపండువులుగాఁగ
           వల్మీకభవువచోవై ఖరి రామాయ
                ణంబు నాంధ్ర ప్రబంధంబుఁ జేసె