Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

[మీఁది వంశవృక్షములో "అనితల్లి" తల్లి మల్లాంబిక యని తెలుపఁబడినది. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రులు గారు 'శృంగార శ్రీనాధము'న కాటయవేమనను గూర్చి వ్రాయుచు 'ఈతఁ డు కాటయకు బుత్రుఁడు అనపోత నృపాలుని కల్లుఁడు, తల్లాంబిక, దొడ్డాంబిక, మల్లాంబిక యని యీతనికి ముగ్గురు భార్యలు తెలియవచ్చు చున్నారు తల్లాంబికయందుఁ గుమారగిరి యని కుమారుని, దొడ్డాంబిక యందని తల్లియని కుమార్తెను గాటయ వేమన కాంచినాఁడు. మల్లాంబికకు సంతానము కలదో, లేదో తెలియదు. (పుట 58) అని తెలిపియున్నారు.]

1,2,3,4,5, 6 సంఖ్యలు వేసినవారు వరుసగా రాజ్యమునకు వచ్చిన రెడ్డి రాజులు. వారు రాజ్యము చేసినకాలము వారిక్రింద వేయఁబడినది. ఇందు వేయఁబడిన కాల మిప్పటివఱకు దొరకిన శాసనములనుబట్టి నిర్ణయింపఁబడినది. ముందు లభింపఁబోయెడు శాసనములను బట్టియైనను వీరి కాల మంతగా మాఱక రెండు మూఁడు సంవత్సరము లెక్కువతక్కువగా సరిపోవును గాని యంతకంటె నెక్కువ వ్యత్యాసముండదు. మూఁడవవాcడై న యనవేమారెడ్డి రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్చెను. నాలవవాఁ డయిన కుమారగిరిరెడ్డి రాజమహేంద్రవరరాజ్యమును తనచెల్లెలయిన మల్లాంబ కరణముగా నిచ్చినందున నామెభర్తయు, మేనత్తకొడుకు నయిన కాటయవేముఁడా రాజ్యమును 1386 మొదలుకొని 1400-వ సంవత్సరము వఱకును పాలించెను. కాటయవేముని తండ్రి కాటయ కుమారగిరి తండ్రి చెల్లెలయిన దొడ్దాంబను వివాహమాడెను. అనవేముని మనుమరాలయిన వేమాంబికను వివాహమాడిన యల్లాడ రెడ్డి కాటయవేముని దండనాధుఁడుగా నుండి రాజ్యము నాక్రమించుకొని 1416 -వ సంవత్సరము మొదలుకొని 1426 వఱకును తన పేరనే రాజ్యము చేయ నారంభించెను గాని: పిమ్మట కాటయ వేమునిపుత్రిక యైన యనితల్లిని తన ద్వితీ యపుత్రుఁడైన వీరభద్రారెడ్డికిఁ బెండ్లిచేసి రాజ్యము వారి కిచ్చి చేసెను. కొందఱు కాటయవేమునికి కొమరగిరి యను పుత్రుఁడు పసివాఁడనితల్లి తమ్ముఁ డొకఁ డుండెననియు, ఆతని బాల్యములో తాను మంత్రిగా నుండి యల్లాడ రెడ్డి శత్రుభయము