Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎ ఱ్ఱా ప్రె గ డ


ఎఱ్ఱాప్రెగడ యను కవి నియోగిబ్రాహ్మణుఁడు ఈతని యింటిపేరు చెదలవాడవారు; నివాసస్థలము నెల్లూరిమండలమునందలి కందుకూరి లోని గుడ్లూరు గ్రామము; [ఎఱ్ఱాప్రెగడ గృహనామమును గూర్చియు, నివాసమును గూర్చియు నభిప్రాయ భేదము లున్నవి. ఇతని గ్రంధములను బట్టి యాతని గృహనామమును నిర్ణయింపఁజాలము. విప్రనారాయణ చరిత్ర మును రచించిన చెదలువాడ మల్లనకవి తానెఱ్ఱాప్రగడ వంశజుఁడనని చెప్పికొనుటచే నీతని గృహానామము "చెదలువాడవా" రగునని కొందఱి తలంపు ఎఱ్ఱాప్రెగడ"చెదల్వాడ నిలయుఁ డని మల్లన చెప్పియున్నాఁడు

ఎఱ్ఱాప్రెగడ తాతయైన "ఎఱపోతసూరి" వేఁగినాట కరాపర్తి వృత్తిమంతుఁడcట! కాన నతని నివాసము కరాపర్తి కావచ్చును. భారతారణ్య పర్వ శేషము చివరికి పద్యములంబట్టి యితని నివాసము పాకనాటి యందలి గుడ్లూరైనట్లు తెలియుచున్నది. ఈతఁడు గుడ్లూరిలో నున్నపుడే ఆరణ్యపర్వ శేషమును, నృసింహ పురాణమును రచించెననియుc, దర్వాత మల్లారెడ్డి పరిచయము సంపాదించి, అతని మూలమున నతనియన్న వేమారెడ్డి నాశ్ర యించి అద్దంకిలోఁ గొంతకాలము నివసించి, రామాయణ, హరివంశముల నచటనే రచించి యా వేమారెడ్డికే కృతిచేసె ననియు, వార్ధక్యమునఁ జెదలువాడలో నివసించి యుండుననియు "ఆంధ్రకవితరంగిణి" లోఁ గలదు. (నాలుగవ సంపుటము-పుట 58) తండ్రి సూరన్న: తల్లి పోతమ్మ; ఈతనిది శ్రీవత్సగోత్రము. ఇతడు తిక్కనసోమయాజి తరువాత నించు మించుగా నేఁబది సంవత్సరముల కాలమున నుండినవాఁడు. ఇతఁడు తిక్కనసోమయాజి కవిత్వమునం దత్యంత గౌరవము కలవాఁడయి యాతని వలెనే కవిత్వము చెప్పఁ బ్రయత్నించినవాఁ డగుటచే విరాటపర్వములోఁ