Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

175

ఎఱ్ఱా ప్రె గ డ

దిక్కనసోమయాజి తన తండ్రి కలలో వచ్చి గ్రంథరచన చేయవలసినదని చెప్పినట్టే, తన తాత తన భావము నందు తోఁచి చెప్పినట్టు నృపింహపురాణ మున నిట్లు వ్రాసియున్నాడు.

        సీ. ప్రజ్ఞాపవిత్రుఁ డాపస్తంభసూత్రుండు
                  శ్రీవత్సగోత్రుఁడూర్జితచరిత్రుఁ
           డగు బొల్లనకుఁ బ్రోలమాంబకుఁ బుత్రుండు
                  వెలనాటిచోడునివలన మిగుల
           మన్నన గన్న భీమనమంత్రిపౌత్రుండు
            [1] ప్రేకమాంబా మనఃప్రియుఁడు పోత
           మాంబికా విభు సూరనార్యు మజ్జనకుని
                 బొల్లధీనిధికిని [2]బ్రోలనకును
   
            జన్ననకు ననుజన్మునిఁ గన్న తండ్రి
            వేఁగినాట గరాపర్తి వృత్తిమంతుఁ
            డనఘుఁ డెఱపోతసూరి కంసారిచరణ
            కమలమధుకరపతి సారవిమలయశుఁడు.

వ. మదీయభావంబున నావిర్భావంబు నొంది సదయానంద మధురవాక్యం బుల నన్ను నిట్లని యనుగ్రహించె.

       ఉ. ఉన్నతసంస్కృతాది చతురోక్తిపదంబులఁ గావ్యకర్తవై
            యెన్నికమైఁ బ్రబంధపరమేశుఁ డనంగ నరణ్యపర్వ శే
            షోన్నయ మంధ్రభాష సుజనోత్సవ మొప్పఁగ నిర్వహించి తౌ
            నన్నయభట్ట తిక్కకవినాధుల కెక్కిన భక్తి పెంపునన్.

        క. గిరిశపదభక్తిరసత
            త్పరభావముకలిమి శంభుదాసుఁ డనంగా
            బరఁగిన గోవిందగుణా
            దదసంభృత సౌమనస్యధన్యుఁడ వెందున్. [పీఠిక 15-18]

  1. పేరమాంబా మనఃప్రియుడు-అని పాఠము
  2. బోలనకు -అని పాఠము