Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

161

తి క్క న సో మ యా జి

ఈ తెలుఁగుభారతము కష్టపడి సావకాశముగా నాలోచించి చక్కఁగాఁజేయబడిన గ్రంధమే కాని జనులనుకొనునట్టు మూలగ్రంథమును ముట్టక తెరలో గూర్చుండి నోరికి వచ్చినట్లెల్లను చేయఁఁబడినది కాదు. తిక్కన సోమయాజి పూర్వోత్తర సందర్భములు చెడకుండుటకై తాను వెనుక రచియించినదానిని మరల మరలఁ జూచుకొనుచు, సమాస వర్ణనలు గలిగిన భాగములను రచియింప వలసినచో పూర్వము వ్రాసినదానిని జూచి తదనుగుణముగాను కొన్నిచోట్ల పూర్వము రచించిన పద్యములనే కొంత మార్చియు, మార్పకయు మరల వేసికొనుచు వచ్చెను. ఈ ప్రకారముగా జూచుకొనుచు వచ్చినది భారతములోని యుత్తరపర్వములను రచించునప్పుడు పూర్వపర్వములను మాత్రమే కాక భారతమును రచించునప్పడు తత్పూర్వరచితమైన నిర్వచనోత్తర రామాయణమును గూడఁ జూచుచు వచ్చెను. ఇట్లు చేసినందున కిందుఁ గొన్నియుదాహరణము లిచ్చెదను.

1. శ్రీకృష్ణుని కౌరవులయొద్దకుఁ బంపునప్పుడు భీముఁడు చెప్పిన యుద్యోగ పర్వములోని

          గీ. "అన్నదమ్ములమై యుండి యకిట మనకు
              నొరులు తలయెత్తి చూడ నొండొరులతొడఁ
              బెనఁగ నేటికి ? ఎనెల పెద్దవారి
              బుద్ధి విని పంచి కుడుచుట పోల దొక్కొ"

 అను పద్యమే పుత్రమరణ దుఃఖార్తయైన గాంధారికి కోపశాంతి గలుగునట్లుగా భీముడు చెప్పినట్లు స్త్రీపర్వమున వేయబడినది.

2. విరాటుఁడు తన కూఁతురైన యుత్తరను నాట్యవిద్యాభ్యాసార్థము బృహన్నల కప్పగించుటకు రప్పించునప్పు డామెను వర్ణించిన విరాటపర్వములోని