138
తిక్కన సోమయాజి
యున్నారు; కాని వారన్నట్లాఱుగురు లేరు, కందనమంత్రి 1350 -వ సంవత్సర ప్రాంతములయందుండినవాఁ డయినందున, అతనితాతతాత యగు గన్నమంత్రి యతనికంటె నూఱు సంవత్సరములు ముందనఁగా 1250 -వ సంవత్సర ప్రాంతములయం దుండి యుండవలెను. గన్నమంత్రి గణపతి దేవులమంత్రులలో నొకం డయినందున నిది యాతనికాలముతో సరిపోపు చున్నది. దీనినిబట్టి విచారించినను గణపతిదేవునికాలములో నున్న తిక్కన సోమయాజి 1250 సంవత్సర ప్రాంతములయందే యున్నట్టు స్థిరపడు చున్నది. తిక్కనసోమయాజుల ప్రార్ధనమీఁద గణపతిదేవుఁడు సేనలతో దండయాత్ర బై లుదేఱి వెలనాఁటిరాజులను జయించి నెల్లూరు పోయి మనుమసిద్ధికి మరల రాజ్యమిచ్చినట్లు సోమదేవరాజీయమునందుఁ జెప్పఁబడి యున్నదిగదా ? కృష్ణామండలములోని యినమళ్ళ గ్రామమునందలి శాసనము వలన 1254 -వ సంవత్సరమున గణపతిదేవుఁడు చోళులను జయించిసట్టు తెలియవచ్చుచున్నది. అప్పడు జయింపఁబడిన చోళులక్కన బయ్యన లేమో! అయినపక్షమున సోమయాజులు 1253 -వ సంవత్సరమున నోరుగంటికి గణపతిదేవుని దర్శిం పcబోయినట్టు కనబడుచున్నది. కాని యతఁడు గణపతిదేవుని దర్శింపఁబోయిన కాలము 1258 -వ సంవత్సరమునకుఁ దరువాత.
వారు చూపిన కడపటిదగు నాల్గవ మార్గము నే నుదహరించిన "అంబర రవిశశిశాకాబ్దంబు" లన్న పద్యమునుబట్టి తిక్కనకాలమును నిర్ణయించుట.ఈ పద్యమునుబట్టి తిక్కన మరణకాలము శాలివాహనశకము 1120 వ సంవత్సరము కాఁగా, తిక్కన నూఱేండ్లు బ్రతికెననుకొన్నచో నాతని జన్మ కాలము శాలివాహనశకము 1020 అనఁగా క్రీస్తుశకము 1097-వ సంవత్సర మగునఁట! నిజముగా నట్లయినను దిక్కనసోమయాజి నన్నయ భట్టు కాలములోనివాఁ డను వారివాదమున కిది సపరిపడక నన్నయ మరణానంతరమున నేఁబది సంవత్సరములకుఁగాని తిక్కన పుట్టనే లేదని చూపుచున్నది. ఈ పద్యము విశ్వాసార్హమయినది కాదని యీవఱకే చెప్పి యున్నాను. మెకంజిదొరవారి లిఖిత పుస్తకములపట్టికయం దీ పద్యమునే