పుట:Aandhrakavula-charitramu.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యుదాహరించి విల్సన్ దొరగారు దీనినిబట్టి శాలివాహనశకము 1210 వ సంపత్సరమునం దనఁగా హూణశకము 1288 వ సంవత్సరమున దిక్కన సోమయాజి మృతుఁడయినట్టు వ్రాసి యున్నారు. మరణముగూర్చిన యీ పద్యమును వలెనే యొకానొకరు జన్మమునుగూర్చి కూడఁ జెప్పి సోమయాజిగారు శాలివాహనశకము 1042 -వ శార్వరీసంవత్సర ఫాల్గున బహుళదశమీ కుజవాసరంబున జనన మొంది రని వ్రాసి యున్నారు. మరణమునుగూర్చిన యా పద్య మెంత నిజమో జననమునుగూర్చిన యీ పద్యము నంతే నిజమయి యుండును.

ఇవి గాక నిర్వచనోత్తరరామాయణమునుబట్టి కూడఁ దిక్కన కాల నిర్ణయమును జేయవచ్చును.

మ. 'కమలాప్తప్రతిమానమూర్తి యగునా కర్ణాటసోమేశు దు
     ర్దమదోర్గర్వము యేపుమాపి నిజ దర్పంబుం బ్రతిష్టించి లీ
     లమెయిం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్యనా
     మము దక్కం గొని తిక్కనభూవిభుఁడు సామర్ధ్యంబు చెల్లింపఁడే'


అను పద్యముబట్టి మనుమరాజుయొక్క తండ్రి యైన తిక్కనృపాలుఁడు కర్ణాటసోమేశుని జయించినట్టు కనఁబడుచున్నది. ఈ జయింపఁబడిన సోమేశుఁడు పశ్చిమ చాళుక్యుఁ డయిన నాలవ సోమేశపఁ డయి యుండును. [ ఇయ్యెడ "ఆంధ్రకవి తరంగిణి" కర్తలు క్రింది విధమున వ్రాసి యున్నారు --

"ఈ జయింపఁబడిన సోమేశుఁడు పశ్చిమ చాళుక్యుఁడై న నాలవ సోమేశుఁడయి యుండును" అని శ్రీ వీరేశలింగము పంతులుగారాంధ్రకవుల చరిత్రలో వ్రాసి యున్నారు. కాని యది సరియైనట్లు కన్పట్టదు. ఈ పశ్చిమ చాళుక్యుఁడగు నాలన సోమేశుఁడు శా. శ. 1114 - 1111 వఱకు రాజ్యము చేసిన వాఁడు. ఈ కాలములో తిక్కరాజు లేఁడు ఉన్నను, పదేండ్ల లోపు వయసు కలవాఁడై యుండును. ఏమనిన వెలనాటి పృధ్వీశ్వరుని ఈ తిక్కరాజు తన శైశవముననే చంపియుండెననియు, నది శా. శ. 1218 తరువాత నై యుండుననియుఁ బైన వ్రాసియుంటిని.