132
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సిద్ధాంత మగుచున్నది కాని తిక్కనసోమయాజిని మఱి యిన్నూఱు సంవత్సరములు వెనుకకు నన్నయభట్టుకాలమునకుఁ దీసికొని పోనెంచినవారి కోరిక సఫలము కాకున్నది.
వారు చూపిన రెండవమార్గము దాక్షారామ దేవాలయముమీఁది యొక శిలా శాసనములో గణపతిదేవుని యల్లుడు 1175 వ సంవత్సరములో దానము చేసినట్లున్నందున గణపతిదేవుఁ డా కాలమునకు ముప్పది సంవత్సరములు పూర్వమున నుండి యుండవలె ననియు, దిక్కనసోమయాజియు నా కాలము లోనివాఁడే యనియు, ఈ యూహలలెక్క-ప్రకారమయినను దిక్కనసోమయాజి కంటె నన్నయభట్టు నూఱు సంవత్సరములు పూర్వపువాఁడే యగును గాని వారియభిష్ట మందువలనను సిద్ధింపలేదు. పయి శాసనముయొక్క కాలము సరియైనది కాదు. ఈ శాసనమును శ్రీరామమూర్తి పంతులుగారు స్యూయల్ దొరగారి పూర్వ శాసనముల పట్టిక రెండవ సంపుటము 115 వ పుటనుండి గహించినారు. ఈ శాసనములపయిని స్యూయల్ దొరగారు తాము వానిలోని కాలమును శోధింపలే దనియు, అందుచేత 'చరిత్ర కార్యములకయి యీ క్రింది సంవత్సరముల నాధారపఱుచుకొనఁగూడదు' అనియు శీర్షికగా వ్రాసియున్నారు మఱియు నా క్రిందనే 1201 వ సంవత్సరము మొదలుకొని 1258 -వ సంవత్సరమువఱకును గల గణపతిదేవునికాలము లోని శాసనము లనేకము లుదాహరింపఁబడి యున్నవి. ఇట్లు ప్రత్యేకముగా గణపతిదేవునికాలమును తెలుపు శాసనము లనేకము లుండఁగా వానిని గై కొనక వాని కన్నిఁటికిని విరుద్ధముగా నున్న మఱియొకరినిగూర్చిన యీ తప్పుశాసనము నొక్కదానిని మాత్రము సత్యమునుగా స్వీకరించి దాని పైని వింతయూహల నేల యల్లవలయునో తెలియరాకున్నది.
పంతులవారు చూపిన మూడవ మార్గము కాకతీయగణపతిరాజు మంత్రులలో నొకఁడగు గన్నమంత్రి వసిష్ఠరామాయణకృతికర్త యగు సింగనకవివలనఁ బద్కపురాణోోత్తర ఖండమును గృతినందిన కందనమంత్రి కాఱవ పురుషుఁడయినందున, గణపతిదేవునికాలములో నుండిన తిక్కనసోమయాజి మిక్కిలి పూర్వుఁడని, కందనమంత్రికిని గన్నమంత్రికిని నడుమను ముగ్గురు పురుషులే