పుట:Aandhrakavula-charitramu.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

         దిక్కదండనాధ దేవేంద్రపురికి నీ
         వరుగు టెఱిగి నగము ........
         ..........................
         మరుఁడు మరలఁ గలుగు మగలరాజ !

    సీ. నందిని బుత్తెంచు నిందు శేఖరుఁడు నీ
               వన్న! యేతెమ్ము తారాద్రికడకు
          గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
               వడి సిద్ధతిక్క ! కైవల్యమునకు
          హంసను బుత్తెంచె నజుఁడు నీకడకు ను
              నుభయకులమిత్ర రా బ్రహ్మసభకు
          నైరావతముఁ బంపె నమరేంద్రుఁ డిప్పుడు
              దివమున కేతెమ్ము తిక్కయోధ

          యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువఁగ
          వారు వీరుఁ గూడ వచ్చి వచ్చి
          దివ్యయోగి యైన తిక్కనామాత్యుండు
          సూర్యమండలంబుఁ జొచ్చి పోయె

బ్రహ్మశ్రీ గురుజాడ శ్రీరామమూర్తిపంతులుగారు తిక్కన సోమయాజి కాలనిర్ణయమును గూర్చి యీ పైని నేను వ్రాసినది స్థిరమార్గము కాదని నిర్ణయించి తిక్కన నన్నయభట్టు తోడి సమకాలికుఁ డని సిద్దాంతము చేయుటకయి యేమేమో వ్రాసి యున్నారు. అందలి ముఖ్యాంశముల నిందించుక చర్చింతము. తిక్కన తన నిర్వచనోత్తర రామాయణము నంకితముచేసిన మనుమసిద్దిరాజు క్రీస్తుశకము 1256 వ సంవత్సరమున భూదానము చేసినట్టున్న శిలాశాసనమునుగూర్చియు, 1260 వ సంవత్సరమునందు రాజ్యము చేయుచుండినట్లున్న శిలాశాసనమునుగూర్చియు, స్యూయల్ దొరవారి ప్రాచీన శాసనపట్టిక నుండి నే నుదాహరించిన చరిత్రాంశముల మాట తలపెట్టక వానినుపాయముగా జాఱవిడిచి, వారటు తరువాత "కృష్ణామండల చరిత్ర సంగ్రహమునం దెఱ్ఱగడ్డరాజయిన కాటమరాజును