పుట:Aandhrakavula-charitramu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

123

తి క్క న సో మ యా జి

పల్నాడు ప్రభువైన పద్మనాయకుఁడును గలిసి పశువుల మేఁతబీళ్ళవిషయ మయి పదుమూడవ శతాబ్దమున నెల్లూరు రాజులయిన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్దిరాజు సేనలు కవితిక్కన తమ్ముని కుమారుఁడై న తిక్కన మంత్రిచే నడుపబడినట్లును, చెప్పఁబడి యున్నది." అని నేను వ్రాసిన వాక్యము నింతవఱకు మాత్రమే గహించి, 'కవితిక్కనతమ్ముఁ డనుటకుఁ దమ్మునికొమారుఁ డని పొరపాటునఁబడి యుండవచ్చు' నన్న తరువాతి వాక్యమును బుద్ధిపూర్వకముగా నుపేక్ష చేసి, రణతిక్కన తిక్కన సోమయాజికి పితృష్వపు త్రుఁడయిన తమ్ముఁ డని యేఱిఁగి యుండియు తమ్మునికొడుకని సిద్ధాంతముచేసి, బదుమూడవ శతాబ్దము 1200 లు మొదలుకొని 1300 సంవత్సరమువఱకు నుండవచ్చును. గాన రణ తిక్కన 1201 వ సంవత్సరమున యుద్ధములోఁ జచ్చి 1130 లోనో 1150 లోనో తన తండ్రి కఱువదవ పడిలోనో పుట్టి యుండపచ్చు ననియు ఆ ముసలితండ్రి కంటె నలువదియేండ్ల పెద్ద వాఁడయిన సవతియన్న యైనచోఁ దిక్కన తన తమ్ముని కుమారునికంటె నూఱేండ్లు పెద్దవాఁడు కావచ్చు ననియు, అందుచేతఁ దిక్కన 11౩౦ వ సంవత్సరప్రాంతమున నన్నయభట్టు కాలములో నుండవచ్చు ననియు, ఊహలమీది యూహలతో బయలఁ బందిరి వేసిరి. రణతిక్కన కవితిక్కన తమ్మునికుమారుఁడు కాకపోవుటచే నిది యంతయు నేల విడిచి సాము చేయుట గానీ వేఱుకాదు

      *ఉ. ఏమి తపంబు చేసిస్ పరమేశ్వరు నేమిటఁ బూజ చేసిరో
           రామునితల్లియు బరశురామునితల్లియు భీముతల్లియున్
           గామునికన్నతల్లియును గంజదళాక్షుననుంగుదల్లియున్
           శ్రీమహిత ప్రతాపుఁ డగు సిద్దనతిక్కనఁ గన్నతల్లియున్ !

అనెడి (ఖడ్గతిక్కన యనఁబడు) రణతిక్కనచరిత్రములోని యీ పద్యమును బట్టి రణతిక్కన సోమయాజి కి (కేవలసహోదరుఁడుగాక) మూడవ పెద్ద


మఱి యిరువదిపంక్తులతరువాత నే రణతిక్కన .....తండ్రిసిద్ధయ. ఈ సిద్ధయ సోమయాజికి మూడవ పెత్తండ్రి" అని వ్రాసియున్నారు. *