పుట:Aandhrakavula-charitramu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

100

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

భాస్కరోదంతము క్రీ.శ.1898 వ సంవత్సరమున ననఁగా దాదాపు యేబది సంవత్సరముల క్రిందట ముద్రితమైనది. పంతులుగారి కవుల చరిత్రము రెండవ ముద్రణమును, భాస్కరోదంతమును, జదివిన పిమ్మటcగూడ నాయభిప్రాయము మారలేదు. మంత్రి భాస్కరుఁడు రామాయణములోc గొంతభాగమును రచియించి యుండెననియే నా నిశ్చితాభిప్రాయము. భాస్కరోదంతమునందలి విషయములు కొన్ని సత్యమునకు విరుద్దముగా నున్నవి. ఎఱ్ఱాప్రెగ్గడ రచించిన రామాయణ కృతికర్త ఆనవేమారెడ్డి యని భాస్కరోదంతము తెలుపుచున్నది. అది వాస్తవముకాదు. ఆ రామాయణ కృతిభర్త ప్రోలయ వేమారెడ్డికాని అనవేమారెడ్డి కాఁడు. మంత్రి భాస్కరునియొక్కయుఁ, దిక్కన సోమయాజి యొక్కయు కాలమును భాస్కరోదంతము సరిగా నిర్ణయింపలేదు [రెండవ సంపుటము-పుటలు 126,127]

భాస్కర రామాయణమునకు పీఠికను వ్రాసిన శ్రీ మేడేపల్లి వేంకట రమణాచార్యులుగారు భాస్కర రామాయణముతో మంత్రి భాస్కరునకు సంబంధములేదని తెలిపి యున్నారు,