99
మం త్రి భా స్క రుఁ డు
మంత్రి భాస్కరుఁడు రచించిన రామాయణము మూలము ననుసరించినది కాదు. ఇందు కథాంశములు, వర్ణనలును సంగ్రహించడినవి కావుననే మఱల ఎఱ్ఱాప్రగడ మూలానుసారముగ రామాయణమును రచింపలసి వచ్చినది. భాస్కరుని రచనలో సంస్కృతపదము లెక్కువ. ఎఱ్ఱన రచనలో సంస్కృతాంధ్ర పదములు సమానముగ నుండును.
మంత్రి భాస్కరుఁడు రామాయణమును సమగ్రముగా రచింపలేదు. అసమగ్రమైన యారామాయణమును హుళక్కి భాస్కరుఁడు మున్నగువారు పూరించిరి కాని, ప్రారంభించిన కవి పేరును, పూర్తిచేసిన కవి పేరును 'భాస్కరుఁడే' అగుటచే దీనికి "భాస్కరరామాయణ" మని పేరు కలిగినది; మరియు రామాయణకర్తృత్వమున గూర్చి వివాదములు చెలరేఁగుట కవకాశము నేర్పడినది.
భాస్కర రామాయణములోని కొంత భాగము మంత్రి భాస్కర రచితమని 'తెనుఁగు కవుల చరిత్ర' కారులును వ్రాసియున్నారు. (పుటలు 313, 314) "ఆంధ్రకవితరంగిణి" కర్తయు దీనికి సమ్మతించిరి [చూ. 2 వ సంపుటము-మంత్రి భాస్కరుఁడు]
మఱియు "ఆంధ్ర కవితరంగిణి" లో నిట్లున్నది-- "కవి జీవిత కారులగు శ్రీ గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారును, ఆంధ్ర కవులచరిత్ర ప్రధమముద్రణమున శ్రీ వీరేశలింగము పంతులుగారును, మంత్రి భాస్కరుఁడు రామాయణమునc గొంత భాగమును రచియించి యుండెనని యభిప్రాయపడియున్నారు. అందు పైని శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రిగారు భాస్కరోదంతమను 74 పేజీల గ్రంథమున నీవిషయమును విమర్శించి, భాస్కర రామాయణముతో మంత్రి భాస్కరునకు సంబంధము లేదనియు, హుళక్కి, భాస్కరుఁడే రామాయణ గ్రంధకర్త యనియు నిరూపించి యున్నారు. దానినిబట్టి కాcబోలు శ్రీ వీరేశలింగము పంతులుగారు తమ యభిప్రాయమును మార్చుకొని కవుల చరిత్ర రెండవ ముద్రణమున రామాయణకర్త హుళక్కి భాస్కరుఁ డని వాసియున్నారు