పుట:Aandhrakavula-charitramu.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గోకర్ణ దేవుఁడు


గౌరన, అప్పకవి మున్నగురిచేఁ బేర్కొనఁబడిన 'గోకర్ణచ్చందస్సు'మ రచించిన గోకర్ణ దేవుఁడు-చోడవంశపురాజు. గోకర్ణదేవుని పేరిట నొక శాసనము కలదు ఆశాసనమును నిల్పినవాఁడును, ఛందస్సుకర్తయు నభిన్నులనియే అందఱు నంగీకరింతురు. పయి ఛందో గ్రంథములోని "భాస్కర కులవిలసితవార్థిచంద్ర ! గోకర్ణనృపా !" అను పద్యభాగము పయి యభిప్రాయమును దృఢపఱచున్నది. శాసనమునుబట్టి గోకర్ణదేవుఁడు క్రీ శ. 1127 ప్రాంతపువాఁడని స్పష్టమగుచున్నది.

గోకర్ణ చ్చందస్సులోని కొన్ని పద్యములు మాత్రము లభించినవి. వానిం బట్టి-కవిజనాశ్రయకర్తయగు రేచనవలెనే గోకర్ణ దేవుఁడును తన్ను తాను సంబోధించుకొన్నట్లు తెలియుచున్నది. ఈ గోకర్షదేవుఁడే కవిజనాశ్రయకర్తయైనట్లు శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారును, కీ. శే. శ్రీ చిలుకూరి వీరభద్రరాపుగారును తలంచుట పొరపాటయి యుండవచ్చును.