Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మల్లికార్జున పండితుఁడు

శైవమతవ్యాప్తి నొనర్చిన శ్రీపతి, మంచెన, మల్లి కార్డున పండితులు మువ్వరికిని పండితత్రయమని పేరు. ఆ పండితులలో నితఁడు మూఁడవ వాఁడు. గొప్ప మతసంస్కర్త ఆంధ్రదేశమునందలి లింగధారుల మత సంప్రదాయముల కీతఁడే మూలపురుషుడు. ఈ మల్లికౌర్జనపండితుని చరిత్రను దెలిసికొనుటకు-ఈతని వెనుక 40 ఏండ్లనాఁడుండిన పాల్గురికిసోమనాధుఁడు రచించిన 'పండితారాధ్యచరిత్ర" మను ద్విపదకావ్యమే యాధారము ఈ "పండితారాధ్యచరిత్రము”నే శ్రీనాధ మహాకవి క్రి శ. 14వ శతాబ్దిలో పద్యకావ్యముగా రచించినట్లు తెలియుచున్నది

మల్లికార్డునుఁడు గోదావరిమండలములోని దాక్షారామ భీమేశ్వరుని యర్చకుc డగు భీమనపండితునకును, గౌరాంబకును పుత్రుఁడు. ఇతఁడు బుగ్వేది యనియు, గౌతమ గోత్రజుఁడనియు "చతుర్మరనిర్ణయ" మను నొక సంస్కృతగ్రంధమునందుఁ జెప్పఁబడినదఁట ! (చూ. తెనుఁగు కవుల చరిత్ర పుట 251 ) వానసవంశీయుఁడని పండితారాధ్యచరిత్రమున నున్నది. కోటిపల్లిలో నివసించుచుండిన "ఆరాధ్యదేవర" ఈతని గురుపు. ఇతఁడు గురువునొద్ద శైవదీక్షఁ గైకొని, శైవమతరహాస్యములను సాకల్యముగా గుర్తెఱిగి, శ్రుతిపురాణోక్తిసహితముగ శైవమత మహత్త్వమును ప్రచారము చేసెడివాఁడు. తాను శివపూజానియమమున నున్నను, జంగములు వచ్చినచో వెంటనే వారిని పూజించెడివాఁడు :

మల్లికార్డున పండితుఁడు సనదవోలు (చందవోలు) రాజగు వెలనాటి చోడుని సభలో మతాంతరుల వాదములను ఖండించి శైవమతమును నిల్పెనఁట! ఇతడు కల్యాణపురమున నున్న బసవేశ్వరునిఁ జూచుటకు కుటుంబముతోను, శిష్యులతోను బయలుదేరి దారిలో 'నిడుగుము" లనుచోటఁ దనశిష్యుఁడు దోనయ్యగారికి అన్నమైన వీరచాకి రాజయ్యగారిచే