90
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
ములే కాక కర్ణాటాంధ్రచ్ఛందోగ్రంధములను పేర్కొనఁబడినవి. అందు * రేచియార్ శెయ్ ద వడుగచ్ఛందము" కలదు. ఇది కవిజనాశ్రయమే : ఈయంశమును కీ శే.శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారే తొట్టతొలుత ఆంధ్ర లోకమున కెఱుకపఱచిరి.
క్రీ. శ. 990 ప్రాంతములో నుండిన కన్నడ కవి నాగవర్మ రచించిన 'ఛందోంబుధి" కిని, కవిజనాశ్రయమునకును పెక్కు పోలికలు కలవు కావున 'ఛందోంబుధి' ననుసరించి కవిజనాశ్రయము రచింపఁబడిన దనవచ్చును. ఇందలి పద్య మొకటి మడికి సింగన కూర్చిన 'సకల నీతి సమ్మతము' లో నుదాహరింపఁబడినది. సింగన క్రీ. శ. 1400 ప్రాంతపువాఁ డగుటచే నియ్యది తత్పూర్వమనుటలో సందేహమే లేదు. 'యాప్పిరుంగ లమ్ కారికై' లో నిది పేర్కొనఁబడుటcబట్టి కవిజనాశ్రయము క్రీ. శ. 1100 ప్రాంతమందలిదని నిర్ణయింపవచ్చును.
కవిజనాశ్రయుఁడు మలియ రేచన, విమల యశోభాసుర చరితుఁడు. భీష నాగ్రసుతుఁడు సహాయుఁడుగా నీ కవిజనాశ్రయమును రచించినట్లు స్పష్టముగఁ గలదు.