పుట:Aandhrakavula-charitramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

77

నన్నయభట్టు

దుదవఱకును వడులనే పెట్టియు, ప్రాసముతో (ప్రాసయతితో) నారంభించిన పక్షమునఁ దుద వఱకును ప్రాసములనేపెట్టియు యున్నాడు. దీని కొక్కొక్క లక్ష్యమును జూపెదను.

                
                వడిసీసము
     
     సీ. అడవిలో నేకాంత మతిఘోరతపముమై
                నున్నమా గురులపై నురగశవము
         వైచుట విని యల్గి వారి తనూజుండు
                శృంగి యన్వాఁడు కార్చిచ్చువంటి
         శాపంబు నీ కిచ్చె సప్తాహములలోన
                 నా పరిక్షితుఁడు నా యలుకఁ జేసి
         తక్షకువిషమున దగ్ధుఁ డయ్యెడు మని
                 దానికి గురులు సంతాప మంది

         భూతలేశ ! నన్నుఁ బుత్తెంచి రిప్పుడు
         తద్భయంబు లెల్లఁ దలఁగునట్టి
         మంత్ర దంత్రవిధు లమర్చి యేమఱకుండు
         నది నిరంతరంబు ననియుc గఱప. (అ. 1 -181 )

                       ప్రాస సీసము

     సీ. పాండు కుమారులు పాండుభూపతిపరో
                   క్షంబున హస్తిపురంబునందు
          ధృతరాష్ట్రనొద్ద దత్సుతులతో నొక్కటఁ
                  బెరుఁగుచు భూసురవరులవలన
          వేదంబులును ధనుర్వేదాది విద్యలుఁ
                  గఱచుచుఁ గడలేని యెఱుుకఁ దనరు
          చున్నఁ దద్విపులగుణౌన్నతి సైపఁక
                 దుర్యోధనుండు దుష్కార్య మెత్తి