Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

ఆంధ్ర కవుల చరిత్రము

"శ్రీకంఠం సగుణం సమస్త జగతాం కర్తారమీశం గురుం
 భూతోయానలచంద్రసూర్యపవనవ్యోమాత్మూమమూర్తిం విభుమ్
 నిత్యానందమయోపయో గిరిజయా సార్ధం ప్రజాపృద్ధయే
 మాయాయోగ ముపైతి తం శివకరం వందే శివం శ్రేయసే

 అను శ్లోకమును వేసెను. కావ్యాలంకారచూడామణిని రచియించిన విన్నకోట పెద్దన్న తన పుస్తకము మొదట

"శ్రీవాగాస్పదయోః పరస్పరయుజోః శ్రుత్యుత్సవశ్లాఘయోః
 రాగాలాపనిరూఢయో ర్యతిగణవ్యాపారపారీణయోః
 సారస్యంగిరిజేశయో రివ సదా సంగీతసాహిత్యయో
 ర్విద్వద్విశ్రమ హేతుకం విరహతాం చాళుక్యవిశ్వప్రభౌ "

అను శ్లోకమును వేసెను. తిక్కన తన నిర్వచనోత్తరరామాయణము మొదట
 శ్రీరాస్తాం మనుమక్షితీశ్వరభుజా స్తంభే జగన్మండల
 ప్రాసాదస్థిర భారభాజి దధతీసా సాలభంజీ శ్రియమ్
 శుండాలోత్తమగండభిత్తిషు మదవ్యాసంగవశ్యాత్మనాం
 యాముత్తేజయతేతరాం మధులిహా మానందసాంద్రా స్థితిః"

అను శ్లోకమును వేసెను. ఇట్లుండగా చాముండికావిలాసమునం దాదిని సంస్కృత శ్లోకము లేకుండుటచే నది నన్నయకాలపుది కాదనుట స్పష్టము.

(2) నన్నయభట్టకాలమనం దాచారములో లేని షష్ట్యంత పద్యము లిందుండుట.

(3) నన్నయ్యభట్టుకాలమునందు విశేషముగా వాడఁబడుచుండిన మధ్యా క్కర మొదలగు పద్యము లిందు లేకపోవుట.

(4) నస్నయ సీసపద్యములకంటె భిన్నవిధమైన సీసపద్యము లిందుండుట నన్నయ సాధారణముగా తన సీసపద్యమును వడితో నారంభించిన పక్షమునఁ