Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ఆంధ్ర కవుల చరిత్రము

   దుర్జయమున శకుని కర్ణ దుశ్శాసనుల్
   గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
   గడఁగె బాండవులును గడు ధార్మికులు గానఁ
   బొరయ రైరి వారిదురిత విధుల ( ఆ 3- 12 )

పయి రెండు సీసపద్యములును జదివినచో నాది పర్వము ద్వితీయాశ్వాసము లోని మొదటి దానియందు మొదటినుండి కడవరకును వడులే యుండుటయు, తృతీయాశ్వాసములోని రెండవ దానియందు మొదటినుండి కడవరకును ప్రాసములే యుండుటయు, మీరు కనిపెట్టి యందురు. నన్నయ భట్టారకుని సీసపద్యము లిట్లుండగా, చాముండికావిలాసములోని సీసపద్యములు వడిప్రాససంకరము లయి యుండునట్లు మీరీ క్రింది సీసపాదముల వలనఁ దెలిసికోవచ్చును.


   సీ. పా. ఇష్టదేవాళి సంతుష్టత సేవించి
           మంత్రాధిదేవత మదిఁ దలంచి --ఆ. 12 పద్యము 5

   సీ. పా. ఫెూరంబులై న యాకారము ల్గను నట
           భయపడి భీషణబాహుయుద్ధ --ఆ. 22 పద్యము 5

నన్నయ నియమమునకు కేవల విరుద్ధముగా పయి సీసపాదములు పూర్వార్థమునందు ప్రాసమును, ఉత్తరార్ధమునందు వడిని, కలవిగా నున్నవి.

(5) రాజమహేంద్రవరపు తెలుఁగును గాక దత్తమండలములలో వాడుకలో నున్న "బుద్ధి బుద్ధీ" త్యాది పదప్రయోగములను దరచుగాఁ గలిగియుండుట

1. దేవా ! బుద్దిబుద్ది మహాప్రసాదంబనియట్లనే యొనర్చెదము ఆ2 - 40.
2. తల్లీ ! బద్దిబుద్ధి మహాప్రసాదంబ నీ యాజ్ఞాధారకులము ఆ3 - 8