73
నన్నయభట్టు
మొదలుగాఁ గల పద్యము లున్నవి.ఇత్యాది నిదర్శనములను బట్టి నన్నయ భట్టాది కవి కాకపోవుట నిశ్చయము............యాంధ్ర మహాకావ్యరచనమునం దితఁ దాదికవియే. నన్నయభట్టకృతము లయిన లక్షణ సారములోనిదియు నింద్రవిజయములోనిదియునగు రంగరాట్ఛందమునం దుదాహరింపబడిన పద్యములలో నొక్కొక్క దానినిం దుదాహరించుఁ చున్నాను :
గీ. అచ్చు హల్లును లాపశబ్దాది వర్ణ
మునకుఁ జెప్పిన ఘఙ్ యతి యనగఁ దనరు
నంబురుహ గేహిని సమనులాప యనగ
లక్ష్మి వాగ్జితకోకిలాలాప యనగ
--లక్షణసారము
చ. ఒకపలు వాతఁ గొన్న కిటియన్ దల లోనిడు కూర్మ భర్త నా
లిక లిరుగొన్న సీదరపు ఱేడు బయోధరధారఁ బొట్ట పెం
చుకులనగాళి యీడు ప్రతి జోడని యెంచఁగ గూడ దేరి కె
న్నికగ యయాతియందె ధరణీభర ముంచి చెలంగుదానికిన్
-- ఇంద్ర విజయము
ముందు జెప్పినట్లు నన్నయభట్టు రాఘవాభ్యుదయ మను నొక గ్రంధమును జేసినట్టు వ్రాసి యా గ్రంధములోని దని యీ క్రింది పద్యము నొకానొక రుదాహరించి యున్నారు.
క. వికలుని ఖరదూషణముఖ
సకలవనచరులు పొదివిరి సమ్మదముగ ని
ప్పుకకుప్పకు మూఁగెడు మిడు
తుకపిండువితాన భాఁతి తోచెడు బుద్దిన్.
ఈ పద్యము నన్నయ్యభట్టారకుని కవిత్వమును బోలి యుండక పోవుట చేత నీఁత డా నామము గల మఱిియొక యప్రౌఢకవి యయి యుండ వచ్చును