పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సత్యవోలు భగవత్కవి.


ఈకవి యాఱువేల నియోగిబ్రాహ్మణుడు; జనార్ధనామాత్యపుత్రుడు; భారద్వాజగోత్రుడు. ఈతడు గోదావరీమండలములో నించుమించుగా నూటయేబది సంవత్సరములక్రిందట నుండినవాడు. ఇత డేనుగు లక్ష్మణకవి మొదలగువారితో సమకాలీను డని చెప్పుదురు. ఈకవి రచియించిన గ్రంథములలో రుక్మిణీపరిణయ మనెడు నాలుగాశ్వాసముల ప్రబంధము ప్రధాన మయినది. తాను నూఱుశతకములను జేసినట్టు కవియే తనగ్రంథమునం దిట్లు చెప్పుకొనియున్నాడు--