పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురురాజకవి.


ఈకవి శేషధర్మములను తొమ్మిదాశ్వాసముల గ్రంథమును రచియించి బళ్ళారిమండలములోని జొహరాపురాధిపతి యైన సంజీవిరెడ్డిగారి కంకితము చేసెను. ఇత డిరువది ముప్పదిసంవత్సరములక్రిందట నుండినవాడు. కవిత్వము నిర్దుష్ట మని చెప్పుటకు వలదు పడకపోయినను మొత్తముమీద బుస్తకము రసవంతముగా నున్నదని చెప్పవచ్చును. కవికృతము లయినకావ్యాదులనుగూర్చి కృతిపది పలికినట్లుగా గ్రంథమునందీక్రిందిపద్యములు చెప్పబడినది.--