పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనియాది గణపతిదేవుడు.


ఇతడు శివయోగసార మనుగ్రంథమును రచియించెను. ఈవేదాంతగ్రంథము పూర్వోత్తరభాగములు గలదయి, భాగమొకటికి నాలుగేసియాశ్వాసములు గలదిగా నున్నది. ఈకవి నియోగిబ్రాహ్మణుడు; మూలనామాత్యుని పుత్రుడు. ఈతనికవిత్వము ప్రౌఢమయి హృద్యముగానున్నది. ఈతదేకాలపువాడో సరిగా తెలియదుగాని యిన్నూఱుసంవత్సరములకుముందే యుండినవాడయిన ట్లూహింపదగియున్నాడు. శివయోగసారమునుండి కొన్ని పద్యముల నిం దుదాహరించుచున్నాను