పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దించుచున్నవి. భావవివేకుడు జపించిన హృదయ ధారణి సూత్రము, యుఆన్ చ్వాంగ్ తనదేశమునకు గొంపోయెను. అద్దానిని చీనాదేశములోనికి చిటూంగ్ అనువాడు భాషాంతరీకరించెను. ఈసూత్రమిపుడు ఇంగ్లీషు భాషలోనికి భాషాంతరీకరింపబడి, 1875 వ సంవత్సరపు రాయల్ ఏషియాటిక్ సొసైటీవారి పత్రికయందు 27 వ పేజీయందు ప్రకటింపబడియున్నది.

విజయవాడ లేక ధాన్యకటక దేశము నుండి దక్షణాభిముఖుడై యుఆన్ చ్వాంగ్ చోళ మండలమునుగూర్చి బోయెను. దేశమును గూర్చి యాతడిట్లు వ్రాసెను.

"చోళదేశము 2400, 2500 లీలు (600 మైళ్ళు) వైశాల్యము గలిగియున్నది రాజధాని పదిలీలు వైశాల్యము గలిగి యున్నది. దేశము భయంకరముగానుండి, నిర్జనమై యున్నది. ఎటుజూచినను చిట్టడవులును, తేమలూరు భూములును గాన్పించును. బందిపోటు దొంగలు నిర్భయులయి గ్రామములగుండ పోవుచు, దోచుకొను చుండుటచే, జనులు కాపురము చేయుటకు భయపడుచుందురు. దేశము ఇతరాంధ్ర దేశమువలె, యుష్ణముగా నుండును. జనులు చంచల స్వభావులును, కౄరులుగా నున్నారు. వీరిలో జాలమంది బ్రాహ్మణులు. సంఘారామములును బిక్షుక శూన్యములై అసహ్యములుగా నుండుచు శిధిలమయి పోవుచున్నవి. ఉన్న సన్యాసులుకూడ నశుభ్రముగా నున్నారు. బ్రాహ్మణ దేవాల