పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనగ్రంథమునందు విమర్శించి యుండెను. నాగార్జునుని ప్రజ్ఞాపారమితసూత్రమునకు వ్యాఖ్యానముగా నీతడు "ప్రజ్ఞాలంపశాస్త్రప్రదీపిక" యను గ్రంథమును రచించెను. ఇదియు చీనాభాషలో గలదు. ఈగ్రంథమునందు నాగార్జునుని మహాయన సంప్రదాయములను సిద్ధాంతముచేసి సమర్ధించుటకై భావవివేకుడు సాంఖ్యమునే విశేషముగ నుపయోగించెను. ఈ "ప్రజ్ఞాలంప శాస్త్రప్రదీపిక" తిబెతు భాషయందు, ప్రజ్ఞాప్రదీ-మూలా-మధ్యమిక వృత్తి" యని బరగుచున్నది[1] ఈతనిచే రచింపబడిన మరియొకగ్రంథము తిబెతుభాషలోనే యున్నది. దానిపేరు "తారకజ్వాలా" యట. ఇది యించుమించుగ "ప్రజ్ఞాప్రదీపశాస్త్ర" మువలె నుండును.[2]

భావవివేకస్వామి ఉపాసించిన వజ్రపాణి మంత్ర శాస్త్రమున కధిదేవతయని బౌద్ధగ్రంథములు జాటుచున్నవి. మరికొన్ని యాతడు బోధిసత్తుడని వాకొనుచున్నవి మరికొన్ని యాతని యక్షులకు నాయకుడని బేర్కొనుచున్నవి ధారణిసూత్రముల నుపాసనావిధిప్రకారము, ఆవగింజలు మంత్రమున కుపయోగింతురని యుఆన్ చ్వాంగ్ చెప్పుచున్నాడు. విథ్యుక్తముగా జపించిన నావగింజలతో, వర్షము కురిపింపవచ్చునట! పర్వతములను ఛేదింపవచ్చునట! భూమిని రెండుగా జీల్చి వేయవచ్చునని ధారణిసూత్రములు ప్రతిపా

  1. Taranatha's History of Buddhism p. 277
  2. Wassaf's Buddhism p. 287