పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యము లనేకములు గలవు. ఇక్కడ దిగంబర జైనులును పెక్కుమంది గలరు.

"రాజథానికి నైరృతిగా నొక యశోకవనమును, స్తూపమును గలవు. పూర్వమిచ్చట తథాగతుడు చాలకాలము నివసించియుండి, 'చాలమంది దిగంబరజైనులను బ్రాహ్మణులను, దేవతలను, బౌద్ధులనుగా జేసియుండెను."

"నగరమునకు పశ్చిమముగా అనతిదూరమున నొక పురాతనమైన సంఘారామము గలదు. ఇచ్చట అర్హతుడొకనితో, దేవబోధిసత్త్వుడు వాదించెను. ఆవృత్తాంత మిట్టిది. దేవబోధిసత్త్వు డొకప్పడీ సంఘారామమునందు ఉత్తరుడను అర్హతుడు నివసించు చుండుననియు, నాతడు షడభిజ్ఞుడనియు అష్టవిమోక్షకుడనియు విని యాతనిచూచి యాతని జీవితపద్ధతి నవలంబింపగోరి యేతెంచియుండెను. ఆసంఘారామమునకు వచ్చి తన కారాత్రి నిదురించుటకు తావొసంగ వలసినదని అర్హతుని బ్రార్థించెను. అర్హతు డుత్తరుడు నివసించు చోట నొక మంచము మాత్రమే యుండెను. అయినను దేవబోధిసత్త్వుడు, అర్హతుని యాధిక్యమును గ్రహించి, యాతని గదిని బ్రవేశించెను. అర్హతుని కొక చాపయులేనందున కొన్ని రెల్లుదుబ్బులను దెచ్చి చాపగాచేసి, దేవుని కూర్చుండ ప్రార్థించెను. దేవబోధిసత్త్వు డాసీనుడైన పిదప అర్హతుడు ధ్యానసమాధియందు బ్రవేశించి, అర్థరాత్రము గతించినవెనుక లేచివచ్చెను. దేవుడపుడు