పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని బదులు చెప్పెను. తుద కెంతమంది రాయబారులు సందేశము గొనివచ్చినను ఉభయులకు సమావేశము గాలేదు.

పిమ్మట భావవివేకుడు స్వదేశమునకు దిరిగి వచ్చి నిష్కళంకమైన జీవితమును గడపుచు ధ్యాన సమాధియందు బ్రవేశించి "మైత్రేయుడు సుగతుడై వచ్చునందాక నాసందేహములను బాపు వారెవ్వరు? యని చింతింపసాగెను. ఇట్లు చింతానిమగ్నుడై యుండిన కాలమున, భావవివేకుడు ఆహారమును నీటిని పరిత్యజించి నిష్ఠాపరుడై మూడు సంవత్సరములహోరాత్రములు, అవలోకితేశ్వర బోధిసత్త్వుని మ్రోల నిలచి హృదయ ధారణిమంత్రమును పఠించి ధ్యానించెను. అట్లు మూడు సంవత్సరములు గతించునప్పటికి అవలోకితేశ్వరుడు మోహనమూర్తితో ప్రత్యక్షమై "శాస్త్రపారంగతుడా, నీ వేమి కోరినన్ను ధ్యానించితివి" అని ప్రశ్నించెను. భావవివేకు డపుడు "నా దేహమును, మైత్రేయుడు సుగతుడై వచ్చునందాక నిలచియుండున ట్లనుగ్రహింపుము." అని ప్రార్థించెను. అవలోకితేశ్వరు డంతట "ఓయీ! మానవుని జీవితము క్షణక్షణమును విపత్తులకు లోనై యున్నది. ప్రపంచ మంతయు శూన్యమైనది. కావున నీవు జీవితముయొక్క పరమార్థమును, 'తుషిత' స్వర్గమును బొంది మైత్రేయుని బోధనల నాలకింపుటగా గ్రహించి యాతడు బుద్ధుడై యవతరించిన వెనుక అతనివలన నిర్వాణ మార్గమున గ్రహించెదవు గాక యని హెచ్చరించెను. భావవివేకు డామందలింపులను