పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాతనితో వాగ్వాదము చేసి గెలుపొందవలయునని సంకల్పించుకొని శిష్యసమేతుడై మగధదేశమును గూర్చి పయన మయ్యెను. పాటలీపుత్రమును జేరునప్పటికి ధర్మపాలుడు,బోధివృక్షము (రావిచెట్టు) క్రింద కూర్చుండి ధ్యానతత్పరుడై సమాధియందున్నాడని వినెను. అంతట భావవివేకుడు తన శిష్యులనుజూచి "ధర్మపాలుడు బోధివృక్షముక్రింద కూర్చుండి సమాధియం దున్నవాడట. మీ రాతని కడకుబోయి నా మాటలుగా నిట్లు బల్కుడు. "ధర్మపాల బోధిసత్త్వుడు, బుద్ధుని ధర్మమును ప్రపంచమున కుపదేశించు చున్నాడు. అజ్ఞానులను జ్ఞాన మార్గమునకు ద్రిప్పుచున్నాడు. శిష్యుల చేతను, బౌద్ధులచేతను ధర్మపాలుడెంత పూజింప బడుచున్నను ఆతని తపస్సును ధ్యానమును దీక్షయు వృధయై నిష్పలములయ్యెను. కావున ధర్మపాలుడు బోధివృక్షము క్రింద కూర్చుండి నంతమాత్రమున బుద్ధుడు కాజాలడు. కావున నీ విపుడు సమాధియందు బ్రవేశించి జ్ఞానివిగమ్ము. పిమ్మట దేవతలకు మానవులకు గూడ నీవు మార్గదర్శకుడ వగుదువు" అని చెప్పి పంపెను.

"ధర్మసాల బోధిసత్త్వుడా మాటల నాలకించి "మానవజీవితము అనిత్యమైనది. దేహము బుద్బుదప్రాయము. అహోరాత్రములు నేను మోక్షసాధనమును చింతన చేయుచు ధ్యానించు చున్నాను. నీతో వాదము చేయుటకు నాకు సావకాశము లేదు. కావున నీవు నచ్చినచోటుకే తిరిగి పొమ్ము"