పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వదగినను యీకాలపు ఫ్రెంచిపండితులు కొందఱు జినయనియు చిన్నయని వివిధములుగా పొరబాటు పడిరి. దిజ్ఞ్నాగాచార్యుడు వేంగీపురపీఠమున కధ్యక్షుడనియు మహాతత్త్వవేత్త యనియు తార్కికుడనియు, యోగ శాస్త్రజ్ఞుడనియు చాల బేరెన్నిక గనినవాడు. ఈతని జీవితము డుర్మార్గులగు అసహన పూరితులునగు బ్రాహ్మణమతస్థులచే నాతని గ్రంథములతో దగ్ధము గావింపబడి విస్మరింపబడినది. ఈత డాంధ్రుడట. ఈతని జీవితమును గూర్చి దెలిసిన కొంచెమునుగూడ తిబేతు దేశ గ్రంథములమూలమున దెలియుచున్నది. దక్షిణమున కాంచీపుర సమీపమున సింహవక్త్రమను గ్రామమున నొక బ్రాహ్మణకుటుంబమున నీతడు జనన మొందెను. సింహవక్త్రపుర మాకాలమున నచ్చట నేగ్రామమునకు సరిపోవునో తెలియరాదు. మొదట నీతడు బ్రాహ్మణవిద్య నభ్యసించెను. కొంతకాల మయిన తరువాత వత్సిపుత్ర సంఘమునకు జెందిన హీనాయన సాంప్రాదాయబౌద్ధమతము నీతడు స్వీకరించెను. కాని ఏకారణముననో గురువుయొక్క యాగ్రహమునకు బాత్రుడై సంఘారామమునుండి వెడల గొట్టబడెను. పిదప నీతడు వసుబంధుని సంఘమును జేరెను. ఒడి వీనసమను నగరమున భోరశైలమందు చాల కాలముండి ఒకప్పుడు నాలందా సంపూరామమునకు వాగ్వాదము కొఱకు పయనమయ్యెను. అచ్చట చాలమంది అన్య సంప్రదాయకులతోడను ఇతర సాంఘికులతోడను బ్రాహ్మణులతోడను వాదించి