పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ గుహయొక్క నడిమికొలత పదునెనిమి దడుగులుండును. కుడ్యములు సుమారు పదునైదడుగులెత్తుండును. గోపురము యొక్క గర్భము నాలుగడుగు లెత్తును అడుగున అడ్డకొలత పండ్రెండడుగులు నిడివియు నుండును. ఈగోపుర శిఖరము నుండి క్రిందకు గుహయొక్క ఎడమభాగమునకు ఒక శిలాస్థంభమొకటి పూర్వము లేచియుండెను. ఇప్పు డాశిలాస్థంభము అచ్చటగానరాదు గాని దాని చిహ్నములు గాన్పించును. ఆస్థంభముయొక్క అడుగుభాగము బ్రాహ్మణులచే శివలింగాకృతిని చెక్కబడి శివాలయము క్రింద మార్చబడి యున్నది. పూర్వపు పైస్థంభము యొక్క పైభాగము ఇప్పటికిని శివలింగమునకు సూటిగా నెత్తిపైగోపురమునందు నడుమ కణువువలె వ్రేలాడుచున్నది. గుహాలయ సింహద్వారముపై గుఱ్ఱపు డెక్కవలె నుండు కవాటము గాన్పించును. ఇచ్చటి స్తూపములును గుహలును విహార నిర్మాణయుగములకు బూర్వము అనగా క్రీ.శ. రెండవశతాబ్దాంతమున నిర్మింపబడి యుండవలయును.

మన యాత్రికునిచే వర్ణింపబడిన వేంగీపుర సమీపమున నుండి గుహలు, చైత్యము స్తూపములును, గుంటుపల్లి జీలకర్రగూడెముల సమీపమున నుండి నట్లూహింప వలయును. ఇచ్చట జీవయాత్రను గడపిన జినబోధిసత్త్వుడు దిజ్ఞ్నా గాచార్యుడని తిబెతు గ్రంథమూలమున దెలియుచున్నది. చీనాభాషయందు పూర్వము యువాన్ చ్యాంగ్ వ్రాసినది యీకాలపు వర్ణక్రమమునుబట్టి దిజ్ఞ్నాగ బోధిసత్త్వుడని చదు