పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గెలుపొందుచు వచ్చెను. ఇతడు ఒడివీసనగరమునకు దిరిగి వచ్చిన తరువాత హేతువిద్యా తర్కశాస్త్రమునుగూర్చి యొకశాస్త్రము రచింప దలపెట్టెను. ఆసంకల్పమంకురించి నపుడు భూకంపమును గొప్పవెలుగును బ్రహ్మాండము బ్రద్దలగునంత మహాధ్వనియు నయ్యెనట. అదిచూచిదిజ్ఞ్నాగుడు భయపడుచుండ, మంజుశ్రీ బోధిసత్త్వుడు ప్రత్యక్షమై భయమువాపి, యాతనికి నూతన విషయములను బోధించి ప్రోత్సహించెనట! అంతట నాతనిని యాదేశపు రాజు మిక్కిలిగౌరవించి పోషించెను. దిజ్ఞ్నాగుడు మొదట నివసించుచుండిన భోరశైలమును, ఒడివీస నగరమును బంగాళా దేశమందున్నవి. దిజ్ఞ్నాగుడు చాలకాలము వేంగీదేశమున నివసించిన వాడగుటవలన, యీతని పోషించిన రాజులు విష్ణు కుండినులనిగాని, నాలంకాయనులనికాని యూహింహవచ్చును.

దిజ్ఞ్నాగాచార్యుడు అర్హతుడైన అచలునిచే నిర్మింపబడిన వేంగీపుర ప్రాంతపు గుంటుపల్లి చైత్యము, స్తూపములందే, చాలకాలము నివసించి యుండెను. కాని యపుడపుడు కొంతకాల మజాంతాగుహలందును, ఓరుగంటి సమీపమున గల సంఘారామము నందును కాలము గడుపుచు వచ్చెను. మల్లినాథసూరి తనమేఘసందేశ వ్యాఖ్యయందు దిజ్ఞ్నాగుని గూర్చి చేసిన ప్రశంసను విశ్వసించినయెడల మనమాతడు, మహాకవి కాళిదాసునికి సమకాలీనుడైయుండి యాతని గ్రంథములను కడు కాఠిన్యముతో విమర్శించి యుండెనని యూ