పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధింప సమకట్టెను. హేతువిద్యాశాస్త్రయగాధమై, దురవగాహమై, బహుశ్రమచేత గాని సుబోధము గాకుండుటచే నది ముక్తిమార్గ మన్వేషించు వారికి నిరుపయోగముగా నుండుట గాంచి యాతడు పర్వత గుహలందు జొచ్చి ధ్యానపరుడై యోగసమాధిలో నుండియాశాస్త్రమును సులభముగా సాధించుటకు దగిన గ్రంథమును రచింప యోచించెను. ఇట్లుండ నాతని తపోనిష్ఠకు పర్వతములు కనుమలు కంపించెను. ఆకసమంతయు ధూమముచేతను కాఱుమబ్బుల చేత నావరింపబడియెను. అంతట నాపర్వతము నాశ్రయించి యుండు అధిదేవత యాబోధిసత్త్వుని ఆకసముమీదకు గొంపోయి యిట్లు పలికెను. "పూర్వకాలమున తథాగతుడు ప్రపంచమును నిర్వాణమార్గము వైపు త్రిప్పబ్రయత్నించెను. లోకముపై జాలికొని యాతడు హేతువిద్యా శాస్త్రమును వెల్లడించెను. కాని తథాగతుడు నిర్వాణము బొందిన తరువాత నాశాస్త్రము లోకమునకు దుర్గ్రాహ్యమయ్యెను. కావున నోజిన బోధిసత్త్వుడా! నీజ్ఞాన తపములు అపారములు; సర్వజ్ఞుడ వైన నీవు యాశాస్త్రమును పూర్ణముగా నెఱంగి దాని మహిమను లోకమునకు బోధింపుము."

"పిమ్మట బోధిసత్త్వుడు, ప్రపంచము నంతటను జ్యోతిర్మయము చేయగల వజ్రసమాధియందు బ్రవేశించి ధ్యానతత్పరుడై యుండెను. ఆ సమయమున నాదేశము నేలు