పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దానిని సత్స్వరూపమును శిల్పి తన నేర్పరితనమునంతయు జూపి చెక్కెనో యన్నంతగా కళలూరుచు మనోహరముగా నున్నది. ఈసంఘారామమున కెదురుగా వందలకొలది యడుగుల ఎత్తుగల స్తూపమొకటి గలదు. ఈస్తూపమును, సంఘారామమును అచలుడను అర్హతుడు[1] నిర్మించెను.

"ఈసంఘారామమునకు (మఠము) నైరృతిదిక్కుగా కొంచెముదూరమున నింకొక స్తూపమును అశోకవనమును గలవు. పూర్వకాలమున తథాగతుడిచట నివాసము చేయుచు తనప్రజ్ఞచే చాలమందిని బౌద్ధులనుగా జేయజాలెనట.

"ఇక్కడనుండి నైరృతిదిక్కుగా నిరువది లీలుదూరమున నొంటరిగానున్న కొండపై నొక శిలాస్తూపముగలదు. ఇక్కడ జినబోధిసత్త్వుడు న్యాయద్వార తారకశాస్త్రమను "హేతువిద్యాశాస్త్రమును" రచించెను. బుద్ధుని యనంతర మీ బోధిసత్త్వుడు బౌద్ధమతము నవలబించి శ్రమణకుడై, కాషాయ వస్త్రముల ధరించెను. పిదప జితేంద్రియుడై, నిష్కాముడై, చిరకాల మభ్యసించి బ్రహ్మజ్ఞానమును సంపాదించెను. అతని జ్ఞానశక్తియు, తపశ్శక్తియు నపారములు. అతడు మహాశక్తి సంపన్నుడైనతరువాత నిరాధారముగ నున్నలోకముపై జాలిచెంది బౌద్ధధర్మములను జనులకు

  1. అర్హత పదము సంస్కృతమున ఆచార్యుడగుచున్నది. బౌద్ధధర్మ సిద్ధాంతముల ననుసరించి పునర్జన్మ లేకుండచేసికొనగలుగువాడు ఆచార్యుడు (అర్హతుడు) అగుచున్నాడు.