పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజు జినబోధి సత్త్వుని సమీపించి జన్మరాహాత్యమును బడయుమని ప్రార్థించెను."

జినబోధి సత్త్వుడపుడు "రాజా నేనుదురవగాహమైన హేతువిద్యా శాస్త్రసూత్రములను స్పష్టముచేయుటకై సమాధియందు ప్రవేశి చితిని. నాహృదయమిపుడు జన్మరాహిత్యమును గోరుటలేదు. సమ్యక్ సంబోధికై యెదురు చూచుచున్నది" అని ప్రత్యుత్తర మిచ్చెను."

"రాజ తట జన్మరాహిత్యఫలమే మహర్షుల యాశయము. మూడువిద్యలనెఱిగి భూర్భువస్సు నల్లోకములనుండి విముక్తుడగుటకన్న ఫలమేమి గలదు. తప్పక మీరు జన్మరాహిత్య ఫల మనుభవి తురుగాక" యని విన్నవించెను.

"జినబోధిసత్త్వుడు రాజు చెప్పిన మాటలకు సంతుష్టాంత ర గుడై ధ్యాన సమాధియందు ప్రవేశించి జన్మరాహిత్యఫలమును బడయనెంచెను. కాని యాతడొక్కడే యా విజ్ఞానమును సంపాదించి ముక్తి నొందుటవలన లోకమున కేమియుపకారమునుగలుగదనియు బోధిసత్త్వునియొక్క స్వార్ధపరత్వమునకు చింతిల్లి యాతనిపై జాలిగలిగి మంజుశ్రీ బోధిసత్త్వుడాతని ముంగిట సాక్షాత్కరించి యిట్లని యాజ్ఞాపించెను. "అయ్యా! నీవేల మొదట సంకల్పించిన పుణ్యకార్యమును విరమించితివి. నీవొక్కడవే నిర్వాణమును బొంద నితరులందఱు అజ్ఞానాంధకారమునుండి సంసార బంధముల దగుల్కొని తిరుగాడ వలసినదేనా? నీవు నీనిర్మల జ్ఞానమును