పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిక్షుకు డైనపిదప పాపమునుండి విముక్తుడైనప్పడు ప్రవేశించు విమల భూమికను గురించియు ప్రశ్నోత్తర రూపకమైన గ్రంథమిది. ఇందు బోధిసత్త్వుడు, బుద్ధుడగుటకు బూర్వము, దు:ఖమున మరల బడిపోకుండ ననుభవించు అమితాయు స్వర్గముయొక్క సౌఖ్యమును గూర్చి మనోహరమైన స్తోత్రకదంబము గలదు. హీనాయన సంప్రదాయము ప్రకారము మనుష్యుడు జీవమును, మృత్యువును దాటి, అతీతుడై నాశ మొందుటయే నిర్వాణపదవని నాగార్జునుడు నమ్మియుండెను. సకల జీవకోటియొక్క నిర్వాణసిద్ధికై, (దు:ఖనివారణమునకై) యీ గ్రంథమునం దొకచోట నాగార్జునుడు ప్రార్థన శ్లోకములను రచించెను. అవి మిక్కిలి మనోహరములై యున్నవి. ఇక నాగార్జునాచార్యుని గ్రంథము లన్నిటిలో "ప్రజ్ఞాపారమిత సూత్ర వ్యాఖ్యశాస్త్రము" మిక్కిలి యత్కృష్టమైనది. కుమారజీవుడీ గ్రంథమును చీనాభాషలోనికి క్రీ.శ. 485 వ సంవత్సరమున భాషాంతరీకరించెను. ఈ గ్రంథము మహా ప్రజ్ఞాపారమితసూత్రము పైన ద్వితీయము, నుద్వేలమగు వ్యాఖ్యయని పేరొందెను.

నాగార్జునుడు మహాయన బౌద్ధమతమునకు ప్రముఖుడును ప్రవర్తకుడనిమాత్రమేగాక, విదేశములందు స్వదేశమునందునుచిరకాలజీవియని దిగంతమైన యశమును సంపాదించి యుండెను. ఈతడు బ్రాహ్మణ విద్యలయందుగూడ నుత్తీర్ణుడై వైదికమతమునందలిరహస్యముల నభ్యసించెను. మూలికల