పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౪

ఆంధ్రదేశము-విదేశయాత్రికులు

౧౪౦౦ లేక ౧౫౦౦ లీలు ప్రయాణము చేయునప్పటికి, (క-లెంగ్క) కళింగదేశమును బ్రవేశించితిమి.

"ఈ కళింగదేశ మయిదువేల లీలు వైశాల్యముగలది. రాజధాని, పదిలీలు కైవారము గలది. భూమి సారవంతమై సస్యములతో నిండియున్నది. ఇచ్చట పుష్పములు ఫలములు విశేషముగ లభించును. వందలకొలది లీల వరకు వ్యాపించియున్న కారడవు లీదేశమునిండ గలవు. ఆయరణ్యములందు కారుమబ్బులబోలి, ఉన్నతములయి కొండలవలె నుండు మదపుటేనుగులు ద్రిమ్మరుచు నుండును. వాటిని బట్టుకొని కాళింగులు ఇతర రాష్ట్రములకు గొపోయి, విశేషధనమునకు విక్రయించుచుందురు. ఈదేశ ముష్ణప్రదేశము, ప్రజలు కొంచెము కోపస్వభావులు, ఆవేశపూరితులు. మోటువారుగను, అనాగరికులుగను గంపట్టినను, కాళింగులు, విశ్వాసపాత్రులు, ఋజుమార్గ వర్తులును మాటదప్పనివారుగా నున్నారు. వారు వడిగా మాట్లాడుదురు. వారిమాటలు తేలికగా వచ్చుచున్న ట్టుండును. కాని యుచ్ఛారణ చాలస్పష్టముగను నిర్దుష్టముగను నుండును. ఆచార వ్యవహారములందును, వేషభాషలందును, కాళింగులకును, మధ్యదేశము వారికిని భేదముకలదు. ఈదేశమున జాలమంది బౌద్ధులును, బ్రాహ్మణులును గలరు. ఇచ్చట పది సంఘారామము (బౌద్ధమఠములు) లున్నవి. వాటియందు స్థవీర సంప్రదాయమునకు జెందినట్టి, మహాయానశాఖా సంబంధులగు ఏనూఱుమంది భిక్షువు లు నివసించు చున్నారు. ఈ దేశ