పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౧౫

మున నూరు దేవాలయముల వఱకును గలవు. ఈ దేవాలయములందు బ్రాహ్మణులుగాక ఇతర మతస్థులను బూజ లర్పించుచుందురు. ఇచట బ్రాహ్మణులును బౌద్ధులును గాక నిగ్రంథులనిబరగు దిగంబర జైనులుగూడ బెక్కుమంది గలరు.

"కళింగము పూర్వకాలమున మిక్కిలి జనసమర్దమై యుండెను. అపుడొకరి భుజములతో నొకరి భుజములు వీధు లందు ఒరసికొనుచుండెను. రాజబాటలందు రథచక్రముల యిరుసు లొండొంటితో సందులేమి డీకొనుచుండెను. జనులందరు తమ యుత్తరీయములను బైకెత్తి పట్టుకొనినచో, సూర్యుని వెలుతురును గప్పివేయుటకు గుడారమగు చుండెను. జన సంకీర్ణమయియుండిన ఇట్టి దేశము ఒకానొకప్పు డొకతాపసి శాపముచే నంతయు నిర్జనభూమి గావింపబడియెను. ఆకథను జనులిట్లు చెప్పుకొందురు. ఒకప్పుడీ దేశమునందొక కొండ చివర నొక ఋషి తపము చేసుకొనుచుండగా, మూఢాత్ముడైన కాళింగుడొకడు ఆమహత్ముని కపచారము గావించెను. ఆమహత్ము డంతట కోపించి, కళింగమును నిర్జనమగునట్లు కోపించి యెటకో జనియెను. ఆశాపమహిమచే నతి శీఘ్రకాలమున జను లెల్లరు దుర్మరణము వాతబడిరి. పిమ్మట కొంతకాలమయిన తరువాత, నితర ప్రాంతముల నుండి జనులు కళింగమునకు వలసవచ్చి నివసింపసాగిరి. అది మొదలుగా దేశమిట్లు స్వల్పజన సంవాసిత మైన యున్నది.

"రాజధానికి సమిాపమున దక్షిణముగా నూరడుగుల