పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుఁఆన్‌చ్వాంగ్‌ వర్ణించిన ఆంధ్రదేశము

౧౩

గూర్చి పయనమయ్యెను. ఈకాలమున కళింగము యొక్క నిజరూపమును నిరూపించుట దుస్తరము. క్రీస్తుశకారంభ కాలమున కళింగదేశమాంధ్ర సామ్రాజ్యములో జేరిపోయినది మొదలు కాళింగులు నాంధ్రలో కలిసిపోయి, నామమాత్రమున కొక తెగవారు గానునట్లుంపించెడిని.[1] కాళింగుల వేషభాషలు, నాగరికత మున్నగునవి యాంధ్రములో సమ్మేళనమైపోయెను. మరియు నేడవశబ్ధాదిని, కళింగమును బరిపాలించుచుండిన రాజవంశములు గూడ వేంగీ దేశమునుండి, వలసబోయిన వారలుగా గన్పపట్టుచున్నారు. మన యాత్రికుడీకళింగమును ప్రవేశించినది మొదలు, వ్రాసిన దానిని బరీక్షించి యందలి వృత్తాంతములు ఎంతవరకు జరిత్రసిద్ధములో వరయుదము. ఈ కళింగముగూర్చి యుఁఆన్‌ చ్వాంగ్ యిట్లు వ్రాయుచున్నాడు.

"కుంగ్-యూ-టో (కొన్యోఢ) దేశమునుండి నైఋతి దిక్కుగా జనిన చామలులేని యొక విశాలమైన యెడారివంటి భూమిని ప్రవేశింతుము. దానినిదాటిన వెనుక, సూర్యకిరణములను సయితము గప్పివేయునంతటి యున్నతములయి తల విరియబోసి కొన్నట్లుండు వృక్షములతో నిండి గాఢాంధకారమయిన మహారణ్యములను వనములను దాటి సుమారు

  1. కళింగము, వేంగిరాజ్యము, ఆంధ్రము దక్షిణకోసల మున్నగునవి మహాంధ్ర దేశములోని, వివిధ ప్రాంతములకు వచ్చియుండిన యాపాత నామములుగా గ్రహింప వలయును